రామ్ కొత్త సినిమాకి లైన్ క్లియర్

Monday,October 15,2018 - 05:45 by Z_CLU

ఈ నెల 18 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా. భారీ స్థాయిలో ఈ సినిమా ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా, సక్సెస్ ఫుల్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందింది ఈ యూత్ ఫుల్ లవ్ లవ్ ఎంటర్ టైనర్.

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. మరీ ముఖ్యంగా ‘పెద్ద పెద్ద కళ్ళతోటి’ సాంగ్స్ యూత్ కి తెగ నచ్చేసింది. ఈ సాంగ్ తో ‘పాపింగ్’ అనే కొత్త డ్యాన్స్ స్టైల్ ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు ఫిలిమ్ మేకర్స్. ఆడియోతో ఈ సాంగ్ విజువల్స్ పై   ఇంట్రెస్ట్  జెనెరేట్ అయ్యేలా చేసిన సినిమా యూనిట్, ఈ రోజు ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయడంతో యూత్ లో ఈ సాంగ్ చుట్టూ మరింత క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. త్రినాధ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కింది. దిల్ రాజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్.