రామ్ 'హలో గురు ప్రేమకోసమే' టీజర్ రిలీజ్ డేట్

Thursday,September 13,2018 - 12:57 by Z_CLU

రామ్ ‘హలో గురు ప్రేమకోసమే’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ టీజర్ ని సెప్టెంబర్ 17 న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతానికి కంప్లీట్ ఫోకస్ ఫిలిమ్ మేకింగ్ పై పెట్టిన యూనిట్, ఈ టీజర్ తో సినిమాప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచనున్నారు.

రీసెంట్ గా రిలీజైన  ఫస్ట్ లుక్ సినిమాపై ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేయడం లో సక్సెస్ అయింది. అయితే ఈ టీజర్ లో ఫిలిమ్ మేకర్స్ ఎలాంటి ఎలిమెంట్స్ రివీల్ చేయనున్నారో నన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో కలుగుతుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. త్రినాథ రావు నక్కిన డైరెక్టర్. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 18 న థియేటర్స్ లోకి రానుంది.