దసరా కానుకగా రామ్ కొత్త సినిమా

Wednesday,July 11,2018 - 02:40 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమా ‘హలో గురు ప్రేమకోసమే’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 18 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

రామ్, అనుపమ జంటగా నటిస్తున్న ఈ సినిమాపై బిగినింగ్ నుండే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు రీసెంట్ రామ్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమాకి పండగ సీజనే పర్ఫెక్ట్ అని ఫిక్సయిన ఫిల్మ్ మేకర్స్, ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం కంప్లీట్ ఫోకస్ సినిమా షూటింగ్ పైనే పెట్టిన ఫిల్మ్ మేకర్స్, త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.