హలో గురు ప్రేమకోసమే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Tuesday,October 23,2018 - 10:54 by Z_CLU

రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా హలో గురు ప్రేమకోసమే. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. దసరా కానుకగా బాక్సాఫీస్ బరిలోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఏపీ, నైజాం కలుపుకొని ఈ సినిమాకు 13 కోట్ల 95 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఫస్ట్ వీకెండ్ లో 5 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ సాధించింది ఈ సినిమా. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ (4 రోజుల) షేర్
నైజాం – రూ. 5.56 కోట్లు
సీడెడ్ – రూ. 2.17 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.89 కోట్లు
ఈస్ట్ – రూ. 0.92 కోట్లు
వెస్ట్ – రూ. 0.63 కోట్లు
గుంటూరు – రూ. 1.38 కోట్లు
కృష్ణా – రూ. 0.90 కోట్లు
నెల్లూరు – రూ. 0.45 కోట్లు