అందుకే అనుపమ పరమేశ్వరన్ వెరీ స్పెషల్

Saturday,September 29,2018 - 12:03 by Z_CLU

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అ..ఆ..’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే అని చెప్పలేం కానీ, చేసిన ప్రతి సినిమాతో ఫ్యాన్స్ కి మరింత దగ్గరయింది అనుపమ. తనలో మరో స్పెషాలిటీ ఏంటంటే మొదటి సినిమా నుండి తన డబ్బింగ్ తానే చెప్పుకోవడం.

టాలీవుడ్ లో హీరోయిన్స్ ఎవరి డబ్బింగ్ వాళ్ళు చెప్పుకోవడం లాంటి సీజన్ ఎప్పుడో బిగిన్ అయినా, ఫస్ట్ సినిమాతోనే డబ్బింగ్ చెప్పుకోగలగడం కొంచెం రేర్ అనే చెప్పాలి. కానీ అనుపమ విషయంలో అలా జరగలేదు. లాంచ్ అయిన సినిమాతోనే సొంత డబ్బింగ్ చెప్పుకుని కంప్లీట్ నటి అనిపించుకుంది.

ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ‘హలో గురూ ప్రేమకోసమే’ సినిమా కోసం ఆల్రెడీ డబ్బింగ్ చెప్పడం బిగిన్ చేసేసింది అనుపమ. ఈ సినిమా అక్టోబర్ 18 న రిలీజవుతుంది.