ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలర్ ఫుల్ బర్త్ డే గిఫ్ట్

Monday,May 14,2018 - 06:32 by Z_CLU

రామ్ కొత్త సినిమా ‘హలో గురు ప్రేమకోసమే’ ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.  అయితే రేపు రామ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇప్పుడీ పోస్టర్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసే పనిలో పడింది.

‘నేను లోకల్’ లాంటి సూపర్ హిట్ ఎంటర్ టైనర్ తరవాత దర్శకుడు త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో న్యాచురల్ గానే ‘హలో గురు ప్రేమకోసమే’ పై హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. దానికి తోడు రామ్ లుక్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

 

జూన్ ఫస్ట్ వీక్ నుండి కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఫిల్మ్ మేకర్స్, ఆ షెడ్యూల్ తరవాత ఇమ్మీడియట్ గా హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోనున్న సినిమా యూనిట్, మ్యాగ్జిమం సెప్టెంబర్ కల్లా సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. దిల్ రాజు  నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్.