రామ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

Tuesday,October 09,2018 - 11:26 by Z_CLU

అక్టోబర్ 18 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా. కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఓవరాల్ గా సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. దానికి తోడు నిన్న రిలీజైన ఈ  సినిమా  సాంగ్స్, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఈ నెల 10 న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు ఫిల్మ్ మేకర్స్.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ నెల 13 న వైజాగ్ లో  గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్నారు. ఆల్రెడీ ఈ ఈవెంట్ ప్రిపరేషన్స్ బిగిన్ చేసిన సినిమా యూనిట్,  ఈ సినిమాని  వైడ్ రేంజ్ లో రీచ్ అయ్యేలా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ తో పాటు ప్రణీత హీరోయిన్స్  గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు.