రామ్ పోతినేని ఇంటర్వ్యూ

Tuesday,October 16,2018 - 03:27 by Z_CLU

ఈ నెల 18 న రిలీజవుతుంది హలో గురూ ప్రేమకోసమే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యూత్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తుంది. దసరా సీజన్ లో ఫెస్టివ్ స్పెషల్ ఎంటర్ టైనర్ గా రిలీజవుతున్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకున్నాడు రామ్. అవి మీకోసం…

టచ్ చేయని పాయింట్…

సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ ఒకటుంది. అది ముందే తెలిసిందే అయినా, ఈ యాంగిల్ లో కూడా చెప్పొచ్చా అనిపించింది కథ వినగానే. అందుకే చేశా…

సెన్సిబుల్ డైలాగ్స్…

సినిమాలో డైలాగ్స్ ఎంటర్ టైన్ మెంట్ కోసమే అని కాకుండా డెఫ్ఫినేట్ గా ఆలోచింపజేస్తాయి. కరెక్టే కదా అనిపిస్తాయి.

ఇది వేరు…

సినిమాలో చాలా ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది కానీ, దానికోసం చాలా మంది కమెడియన్స్ ని పెట్టేసి, స్పెషల్ గా కొన్ని ట్రాక్స్ క్రియేట్ చేయడం లాంటివేవీ ఉండవు. సినిమా మొత్తం జస్ట్ 3 క్యారెక్టర్స్ మధ్య తిరుగుతుంది.

అది వేరే విషయం…

సినిమా హిట్టయినా, ఫ్లాపయినా ఆ సినిమా గురించి అందరినీ అడిగి కనుక్కుంటా… నాకు స్క్రిప్ట్ న్యారేట్ చేయడానికి వచ్చిన వాళ్ళను కూడా అడుగుతా.. నచ్చితే ఎందుకు నచ్చిందో కనుక్కుంటా.. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కనుక్కుంటా… వాళ్ళు చెప్పే ప్రతీది తీసుకుంటానా లేదా అనేది వేరే విషయం కానీ… ఎప్పటికప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూనే ఉంటా…

అలా అనిపిస్తుందంతే…

మ్యాగ్జిమం నేను చేస్తున్న లవ్ స్టోరీస్ ఎక్కువ సక్సెస్ అవుతున్నాయి కాబట్టి రామ్ లవ్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమాలు చేస్తున్నాడు అనుకుంటున్నారు. అలా ఏం లేదు. ఏ జోనరయినా సక్సెస్ అవుతుందనిపిస్తే చేసేస్తా…

గొప్ప సినిమాలు…  

కథ కొత్తగా ఉంటేనే గొప్ప సినిమా అని నేను ఫీలవ్వను. పాత కథ అయినా గొప్పగా చెప్పగలిగితే అది గొప్ప సినిమానే అవుతుంది. అలా పాత కథతో వచ్చిన సినిమాలు కూడా గొప్పగా ఆడుతున్నాయి…

అదీ నేను…

నా సినిమాలో క్యారెక్టర్ చేయడం అనగానే చేసేయను. డెఫ్ఫినేట్ గా ఆ క్యారెక్టర్ కోసం హోమ్ వర్క్ చేస్తాను. నా క్యారెక్టర్, సినిమాలో గిటార్ ప్లే చేస్తుందనుకుంటే, గిటార్ నేర్చుకునే సెట్స్ పైకి వస్తాను.

ప్రవీణ్ సత్తారుతో సినిమా…

బడ్జెట్ రీజన్స్ వల్లే ఈ సినిమా ఆగిపోయింది. అయినా ఫ్యూచర్ లో మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా డెఫ్ఫినేట్ గా ఉంటుంది.

క్రేజీ కాంబో…

దేవి శ్రీ ప్రసాద్, నా కాంబినేషన్ లో వచ్చిన 6 వ సినిమా ఇది. దేవి అలా సింక్ అయిపోతాడంతే. ఒక సిచ్యువేషన్ ఇలా చెప్తామో లేదో, అద్భుతమైన ట్యూన్స్ ఇస్తాడు.