వీకెండ్ రిలీజ్

Tuesday,October 16,2018 - 01:44 by Z_CLU

దేవదాస్ హవా నడుస్తోంది. అరవింద మేనియా మొదలైంది. ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. అయినప్పటికీ ఎన్టీఆర్ కు పోటీగా మరో 2 సినిమాలు రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ లో ఉన్న కొద్ది గ్యాప్ ను ఈ రెండు సినిమాలు భర్తీ చేస్తున్నాయి. దసరా సీజన్ కావడంతో ఈ రెండు సినిమాలకు కూడా వసూళ్లు బాగా వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తున్న సినిమా హలో గురు ప్రేమకోసమే. స్మాల్ గ్యాప్ తర్వాత రామ్ నటిస్తున్న సినిమా ఇది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. వీళ్లతో పాటు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

హలో గురు ప్రేమకోసమే సినిమాతో పాటు థియేటర్లలోకి వస్తోంది పందెంకోడి-2. గతంలో పందెంకోడి సినిమాతో తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకున్న విశాల్, ఆ సినిమా సీక్వెల్ తో ఈసారి దసరా బరిలో దిగాడు. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు లింగుస్వామి దర్శకుడు. ట్రయిలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడం, కీర్తిసురేష్ కు టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉండడం, పైగా ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ కూడా ఎదురుచూస్తుండడం పందెంకోడి-2కు ప్లస్ పాయింట్స్.

దసరా కానుకగా వచ్చిన అరవింద సమేత ఆల్రెడీ హిట్ అవ్వడంతో.. సరిగ్గా దసరాకు వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.