ఈ టీజర్ సోషల్ మీడియాలో సూపర్ హిట్

Friday,September 21,2018 - 12:59 by Z_CLU

చూడ్డానికి సైలెంట్ గా కనిపిస్తాడు రామ్. కానీ సోషల్ మీడియాలో ఆ హీరోకు ఉన్న క్రేజ్ ను మాటల్లో చెప్పలేం. మరోసారి ఈ విషయం క్లియర్ అయింది. రామ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ టీజర్ కు ఏకంగా 50 లక్షల వ్యూస్ వచ్చాయి. అవును.. హలోగురు ప్రేమకోసమే టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ హిట్ మెటీరియల్.

రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా టీజర్ రిలీజైంది. పూర్తిగా యూత్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.