హలోగురుప్రేమకోసమే ...ఫస్ట్ లుక్ తో రామ్ రెడీ

Sunday,May 13,2018 - 02:40 by Z_CLU

ప్రస్తుతం త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో  ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో నటిస్తున్నాడు రామ్. దిల్ రాజు నిర్మాణంలో యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటివలే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుంది. మే 15 న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. రామ్ క్లాస్ లుక్ తో ఈ ఫస్ట్ లుక్ ఉంటుందని సమాచారం.

ఈ సినిమాలో సాఫ్ట్ లుక్ తో ఎంటర్ టైన్ చేయబోతున్నాడు రామ్. ప్రసన్న కుమార్ కథ -మాటలు అందిస్తున్న ఈ సినిమాలో  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దిల్ రాజు.