హలో గురు ప్రేమకోసమే ఫస్ట్ డే కలెక్షన్

Friday,October 19,2018 - 12:31 by Z_CLU

రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన హలో గురు ప్రేమకోసమే సినిమా దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చింది. హిలేరియస్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు డీసెంట్ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 కోట్ల 75 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

దిల్ రాజు బ్యానర్ పై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటించగా… సురేష్, ప్రణీత, పోసాని ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 1.53 కోట్లు
సీడెడ్ – రూ. 0.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 46 కోట్లు
ఈస్ట్ – రూ. 0.27 కోట్లు
వెస్ట్ – రూ. 0.26 కోట్లు
గుంటూరు – రూ. 0.33 కోట్లు
కృష్ణా – రూ. 0.27 కోట్లు
నెల్లూరు – రూ. 0.13 కోట్లు