ఆనందో బ్రహ్మ

Wednesday,July 05,2017 - 04:24 by Z_CLU

నటీ నటులు : తాప్సి, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్,తాగుబోతురమేష్  తదితరులు

సంగీతం : k

బ్యానర్ : 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్

నిర్మాతలు : విజయ్ చిల్లా & శశి దేవిరెడ్డి

కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం : మహి వి రాఘవ్

ఇప్పటి వరకు వచ్చిన హార్రర్ కామెడీ చిత్రాలన్నీ దెయ్యాలు మనుషులని భయపెట్టడం అనే ఇతివృత్తంతో వచ్చినవే.  కానీ, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనేది ఈ “ఆనందో బ్రహ్మ“ లో చూస్తారు. పూర్తి స్థాయి హార్రర్ కామెడీ కథాంశంతో దెయ్యాలకి, మనుషులకి మధ్య జరిగే ఘర్షణ లో ఎవ‌రు గెలుస్తార‌నేది చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేస్తూ  ఈ చిత్రం లో కొత్తగా చూపించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈ మధ్యనే “ రెబెల్ స్టార్” ప్రభాస్ గారి చేతుల మీదుగా విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు భారీ క్రేజ్ దక్కింది. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ట్రేడ్ లో బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ ఈ క్రేజీ మూవీ ఆగస్ట్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

“పింక్” ”ఘాజీ” వంటి విబిన్నమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న తాప్సి ప్రధానపాత్రలో, శ్రీనివాస్ రెడ్డి ,వెన్నెల కిషోర్,”తాగుబోతు” రమేష్,”ష‌కలక” శంకర్, రాజీవ్ కనకాల ఇతర ముఖ్యపాత్రల్లో మహి వి రాఘవ్  రచన, దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది. విజయ్ చిల్లా & శశి దేవిరెడ్డి గారి నిర్మాణంలో 70MM ENTERTAINMENTS బ్యానర్లో రుపొందించిన ఈ చిత్రం పూర్తి స్తాయి ఎంటర్టైనర్ గా తెర‌కెక్కింది.  ఈ సినిమాకు  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ 18న గ్రాండ్  గా రిలీజ్ చేయబోతున్నారు

నటి నటులు: తాప్సి పన్ను,శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్,తాగుబోతురమేష్,  ‘శకలక శంకర్,రాజీవ్ కనకాల, పోసాని కృష్ణ మురళి,తనికెళ్ళ భరణి,విద్యులేఖ రామన్,మరియు ప్రభాస్ శ్రీను

Release Date : 20170818