'ఆనందో బ్రహ్మ' రివ్యూ

Friday,August 18,2017 - 03:03 by Z_CLU

నటీనటులు : తాప్సి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్

సంగీతం : కే

బ్యానర్ : 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్

నిర్మాతలు : విజయ్ చిల్లా & శశి దేవిరెడ్డి

కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం : మహి వి రాఘవ

రిలీజ్ డేట్ : 18 ఆగస్టు 2017

 

బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిన తాప్సి మళ్ళీ తెలుగులో ఓ సినిమా చేస్తుందనగానే ‘ఆనందో బ్రహ్మ’ సినిమా పై  క్యూరియాసిటీ నెలకొంది. ఇక టీజర్, ట్రైలర్ అందరినీ ఎట్రాక్ట్ చేయడం, ప్రభాస్ ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. దెయ్యం వర్సెస్ మనిషి అనే కాన్సెప్ట్ తో హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లో కొచ్చింది. మరి తాప్సి గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన ఈ సినిమాతో ఎలా ఎంటర్టైన్ చేసిందో చూద్దాం.


కథ :

ఉద్యోగరీత్యా మలేషియాలో సెటిల్ అయిన రాము(రాజీవ్ కనకాల) ఇండియాలో ఓ వరదలో తన అమ్మనాన్నలు చనిపోయారని తెలుసుకొని ఇండియా వచ్చి తన తల్లితండ్రులు ఉండే ఇంటిని అమ్మడానికి చూస్తుంటాడు. ఇంట్లో దెయ్యాలున్నాయన్న కారణంతో ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో తక్కువ డబ్బుకే ఆ ఇంటిని ఓ రౌడీకి అమ్మకానికి పెడతాడు రాము. ఈ క్రమంలో అత్యవసరంగా డబ్బు అవసరమున్న సిద్దు(శ్రీనివాస్ రెడ్డి), బాబు(షకలక శంకర్),తులసి(తాగుబోతు రమేష్), రాజు(వెన్నెల కిషోర్) ఆ ఇంట్లో ఉండి దెయ్యాలు లేవని నిరూపిస్తామని రాముతో డీల్ కుదుర్చుకుంటారు.. ఇంతకీ ఆ ఇంట్లో దెయ్యాలున్నాయా? ఉంటే వాటిని ఈ నలుగురు ఏ విధంగా భయపెట్టారు.. అసలు దెయ్యాలు మనుషులకి బయపడతాయా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

నటీ నటుల పనితీరు :

తెలుగులో ఈ మధ్య వచ్చిన ఘాజీ సినిమాలో కేవలం ఓ చిన్న రోల్ లో మాత్రమే కనిపించిన తాప్సి ఈ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్ రోల్ తో ఆకట్టుకుంది. గతంలో హారర్ సినిమాల్లో నటించిన అనుభవంతో మరోసారి లీల అనే రోల్ కి పూర్తి న్యాయం చేసింది. తన కామెడీతో సినిమాకే హైలైట్ గా నిలిచాడు షకలక శంకర్. ముఖ్యంగా పవన్ మేనరిజమ్స్ తో పాటు మరికొందరి మేనరిజమ్స్ తో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేశాడు.
శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ తమ కామెడీతో సినిమాకు ప్లస్ అయ్యారు. ఇక విజయ్ చందర్, పోసాని, రఘు కారుమంచి, వేణు, టార్జాన్, జీవ, శశాంక్ తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

హారర్ కామెడీ సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత ముఖ్యమో తెలిసిందో..ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ‘కే’ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా కొత్త సౌండింగ్ తో ఎట్రాక్ట్ చేసి ముఖ్యమైన సన్నివేశాలను ఎలివేట్ చేశాడు సంగీత దర్శకుడు.
అనీష్ తరుణ్ కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగుంది.కొన్ని సందర్భాలలో వచ్చే కామెడీ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ మహి వి రాఘవ తన స్క్రీన్ ప్లే తో మేజిక్ చేసి ఎంటర్టైన్ చేశాడు. 70MM ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.


జీ సినిమాలు సమీక్ష :

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా హారర్ కామెడీ సినిమాలు థియేటర్స్ లో సందడి చేసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే ప్రెజెంట్ తెలుగులో ఓ హారర్ ఎంటర్టైనర్ సినిమా వస్తుందంటే ఆడియన్స్ కూడా బోర్ గా ఫీలయ్యేంతలా తెలుగులో ఈ జోనర్ సినిమాలొచ్చాయి. అందుకే మొదట నుంచి ఈ సినిమా రొటీన్ గా ఉండదని ఇది దెయ్యాలను మనుషులు భయపెట్టే కొత్త పాయింట్ అంటూ ప్రమోషన్ చేశారు మేకర్స్. అయితే ప్రమోషన్ లో చెప్పినట్లే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. సినిమా స్టార్టింగ్ లో ఓ 15 నిమిషాల పాటు తన స్క్రీన్ ప్లే తోదర్శకుడు చేసిన మేజిక్ బాగా వర్కౌట్ అయింది.
ఇక ఫస్ట్ హాఫ్ లో కాస్త రొటీన్ గా అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ లో తను రాసుకున్న డిఫరెంట్ క్యారెక్టర్స్ తో బాగానే ఎంటర్టైన్ చేశాడు దర్శకుడు. ముఖ్యంగా ప్రతీ క్యారెక్టర్ కి సరైన ఆర్టిస్ట్ ను సెలెక్ట్ చేసుకొని దర్శకుడు ఎంటర్టైన్ చేసిన విధానం బాగుంది. గతం ‘విలేజ్ లో వినాయకుడు’,’కుదిరితే కప్పు కాఫీ’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ‘పాఠశాల’ సినిమాతో దర్శకుడిగా మారిన దర్శకుడు మహి వి రాఘవ్ తనకున్న అనుభవంతో ఓవరాల్ గా ఒక ఎంటర్టైనింగ్ కథతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశాడు.
మొదటి 15నిముషాలు స్క్రీన్ ప్లే, ఎంటర్టైనింగ్ సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు హైలైట్ గా నిలవగా రొటీన్ అనిపించే కొన్ని సీన్స్, మొదటి భాగంలో బోర్ కొట్టే సీన్స్ మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ‘ఆనందో ‘బ్రహ్మ’ సినిమా అందరినీ ఆనందపరుస్తుంది.

రేటింగ్ : 3 /5