'ఆనందో బ్రహ్మ' కలెక్షన్స్ డీటెయిల్స్

Monday,August 21,2017 - 04:10 by Z_CLU

రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తుంది ‘ఆనందో బ్రహ్మ’ సినిమా. విడుదలైన అన్నిసిటీస్ లో హౌస్‌ ఫుల్ కలెక్షన్స్ తో ఎంటర్టైన్ చేస్తున్న ఈ సినిమా మెద‌టి వీకెండ్ కే 4.5 కోట్ల డొమెస్టిక్ గ్రాస్ వసూలు చేసింది. దాదాపు 3 కోట్లతో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు 4.5 కోట్ల డొమెస్టిక్ గ్రాస్ వసూలు చేయడంతో టాలీవుడ్ లో ఈ సినిమా చిన్న సైజు హంగామా చేస్తూ హాట్ టాపిక్ గా మారింది.. ఓవర్సీస్ లో ఇప్పటికే దాదాపు 2.25 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా సోమవారం కూడా అదే హవా కంటిన్యు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ దూసుకెళ్తుంది.

దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత మెప్పించింది తాప్సి. ఇక షకలక శంకర్ హిల్లేరియస్ కామెడీ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ పెర్ఫార్మెన్స్ , ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అన్ని కలగలిపి సినిమాను సూపర్ హిట్ రేంజ్ కి తీసుకెళ్లాయి. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇంకా ఏ రేంజ్ కలెక్షన్స్ వసూళ్లు చేస్తుందో…చూడాలి.