తాప్సీ ఇంటర్వ్యూ

Thursday,August 17,2017 - 07:07 by Z_CLU

అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను తనకంటూ స్పెషల్ ట్రాక్ ని క్రియేట్ చేసుకున్న సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న తాప్సీ ‘ఆనందో బ్రహ్మ’ రేపు రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో ఈ సినిమాకు సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. అవి మీ కోసం…

ఆనందో బ్రహ్మ అలాంటి సినిమా కాదు

ఆనందో బ్రహ్మ జస్ట్ హారర్ సినిమా కాదు,  ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుంది హారర్ తక్కువగా ఉంటుంది.

డిఫెరెంట్ ఆంగిల్ లో ఉంటుంది

హను అసలు దేవుణ్ణి నమ్మడు, దెయ్యాన్ని నమ్మడు… అందుకే తనకు ఇలాంటి ఆలోచన వచ్చిందేమో… దెయ్యం తో అందరు బయపడటం రొటీన్, మనం ఇప్పటి వరకు ఆ ఆంగిల్ లోనే సినిమాలు చేస్తున్నాం… ఎలాంటి కథలు వచ్చినా ఆ ఆంగిల్ లోనే వస్తున్నాయి. కానీ ఆనందో బ్రహ్మ ఆ స్టీరియోటైప్ ని బ్రేక్ చేస్తుంది.

చాలా ఇన్వాల్వ్ అయి చేశాను…

బాలీవుడ్ సినిమాల్లో చాలా ఇన్వాల్వ్ అయి చేస్తాను. కానీ తెలుగు సినిమాల్లో అలాంటి చాన్స్ చాలా తక్కువ. దానికి భాషే కారణం, ఒక్కోసారి లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల సిచ్యువేషన్ సరిగ్గా అర్థం కాక, డైరెక్టర్ ఏది చెప్పేస్తే అలా చేసేదాన్ని, కానీ ఈ సినిమాలో మహి అలా చేయలేదు.. ప్రతీది డిస్కస్  చేసేవాడు, ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం దగ్గరి నుంచి, ఉన్న దాన్ని ఇంకా ఇంటరెస్టింగ్ గా డిజైన్ చేసుకోవడం వరకు ఈ సినిమాని చాలా చాలా ఇన్వాల్వ్ అయి చేశాను… అందరం కలిసి పని చేశాము… అంతెందుకు సినిమా పోస్టర్స్ దగ్గరినుండి ప్రమోషన్స్ వరకు అందరం కూర్చుని ప్లాన్ చేసుకుని మరీ డిసైడ్ చేసుకున్నాం…

ఫీమేల్ సెంట్రిక్ సినిమా కాదు..

ఆనందో బ్రహ్మ ఫీమేల్ సెంట్రిక్ సినిమా కాదు, కొన్ని డిఫెరెంట్ డిఫెరెంట్ క్యారెక్టర్స్ తో నడిచే సినిమా.

ఏమీ కొత్తగా ఉండదు..

ఇందులో నా క్యారెక్టర్ ఏమీ కొత్తగా ఉండదు. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ గతంలో ఇంకెవరైనా ఆల్ రెడీ చేసే ఉంటారు.. సినిమా చూస్తుంత సేపు సేపు నా క్యారెక్టర్ లో కొత్తగా ఏమీ అనిపించదు. ఓవరాల్ గా సినిమా కొత్తగా ఉంటుంది. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీని ముందుకు తీసుకు వెళ్తుంటాయి. ఆ క్యారెక్టర్స్ లో నాదొక క్యారెక్టర్.

నాకు కూడా తెలీదు…

మహి ఈ క్యారెక్టర్ కోసం నన్నే ఎందుకు అప్రోచ్ అయ్యాడో నాకూ తెలీదు. ఈ క్యారెక్టర్ ఎవరైనా చేసేయొచ్చు. నథింగ్ స్పెషల్ ఇన్ దిస్ క్యారెక్టర్. నా వరకు ఈ సినిమా సంతకం చేయడానికి రీజన్ ఈ కాన్సెప్ట్. ఈ సినిమాకి కాన్సెప్టే హీరో.

నా టార్గెట్ అదే…    

నేనెప్పుడూ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలే చేయాలని స్కెచ్ గీసుకోలేదు.. ‘ఘాజి’ సినిమాలో కూడా నాకు పెద్దగా క్యారెక్టర్ లేదు. కానీ సినిమా గొప్పది.. అలాంటి సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే చేసేశాను. నా కరియర్ గోల్ ఏంటంటే తాప్సీ  ఒక సినిమాలో ఉందంటే.. సినిమా మంచి సినిమా అయి ఉంటుంది అనిపించుకోవాలి. పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తాను, అప్పుడప్పుడు సినిమా కోసం చిన్న  క్యారెక్టర్ అయినా చేస్తాను.

నేను స్టార్ ని కాను…

నేను స్టార్ అనే ఫీలింగ్ నాకు లేదు… నేను అందరి లాగే ప్రతి రోజు కష్టపడుతున్నాను. ఎవరి లైఫ్ అంత ఈజీగా ఉండదు. అందరి లైఫ్ లోను స్ట్రగుల్ ఉంటుంది. నా లైఫ్ లో కూడా ఉంది. నేను కూడా ఫైట్ చేస్తున్నాను, కష్టపడుతున్నాను, ప్రతిరోజు ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను… మూవ్ అవుతున్నాను…

స్టార్ హీరోయిన్ డెఫ్ఫినేషన్ మారాలి

ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తేనే ఇక్కడ స్టార్ హీరోయిన్ అంటారు… అదే ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేస్తే కనీసం పట్టించుకోరు… ఈ విషయాన్ని కాస్త సీరియస్ గానే తీసుకోవాలి.. స్టార్ హీరోస్ షాడోలో ఉంటేనే, స్టార్ హీరోయిన్సా..? ధైర్యంగా కథను నమ్ముకుని సినిమా చేస్తే స్టార్ హీరోయిన్స్ కాదా..? ఈ పాయింట్  ఆఫ్ వ్యూ ని మార్చుకుంటే బావుంటుంది.

ఈ సినిమా చేస్తానని ఎవరూ నమ్మలేదు…

ఈ సినిమా సెట్స్ పైకి వచ్చాక కూడా మా టీమ్ కి ఈ సినిమా నేను చేస్తానని  నమ్మకం కుదరలేదు. నేను నెక్స్ట్ డే షూటింగ్ వస్తానా అని కూడా అనుమానించే వారు.. నేను ఈ సినిమాకి సంతకం చేయడానికి మెయిన్ రీజన్ స్క్రిప్ట్.

సినిమాలో ఈ నాలుగు క్యారెక్టర్స్ హైలెట్

సినిమా మొత్తం నాలుగు క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక క్యారెక్టర్ కి రేచీకటి, ఇంకో క్యారెక్టర్ తాగుబోతు… సో ఒక్కసారి తాగేస్తే ఇంకా దేనికీ భయపడడు, మరో క్యారెక్టర్ కి హార్ట్ లో హోల్ ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు, ఇమోషనల్ అవ్వకూడదు, అలాంటి పరిస్థితి వస్తే నవ్వేయాలి, ఇంకో క్యారెక్టర్ స్ప్లిట్ పర్సనాలిటీ పగలు దేన్నీ చూస్తాడో, రాత్రి పూట అలాగే బిహేవ్ చేస్తాడు. ఈ నాలుగు క్యారెక్టర్స్ మధ్య దెయ్యాల పరిస్థితి ఏమై ఉంటుదనేదే కాన్సెప్ట్.

అలాంటి సినిమాలే చూస్తాను..

నా దృష్టిలో రెండు గంటల పాటు కదలనీకుండా ఇంటరెస్టింగ్ గా ఎవ్వరికైనా కనెక్ట్ అవగలిగే ప్రతి సినిమా మంచి సినిమా. అలాంటి ప్రతి మంచి సినిమా చూస్తాను, మాస్ మసాలా ఉందా..? కిరాక్ కామెడీ ఉందా..? సాంగ్స్ ఉన్నాయా..? లాంటివేవీ పట్టించుకోను.. మంచి సినిమా అయితే చూసేస్తాను…

అలాంటి సినిమాలు కూడా చేస్తాను…

రెండు , మూడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేయగానే కొందరు కమర్షియల్ సినిమాలు చేయనేమోనని ఫిక్స్ అయిపోయారు. అలా ఏం లేదు.. నేను చూడటానికి ఇష్టపడే లాంటి సినిమా ఏది వచ్చినా చేస్తాను.. ప్రస్తుతం బాలీవుడ్ లో జుడ్వా – 2 చేస్తున్నాను.

మహి గురించి చెప్పండి…

వెరీ క్లియర్ అండ్ హానెస్ట్ డైరెక్టర్.  తన సినిమా గురించి తనే క్రిటిసైజ్ చేసుకుంటాడు, కరెక్ట్ చేసుకుంటాడు. నిర్మొహమాటంగా డిస్కస్ చేసేస్తాడు…

పింక్ సినిమాకి ముందు… తరవాత అదే డిఫెరెన్స్..

మీడియా దృష్టి మారింది. పింక్ తరవాత నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలేంటి..? పింక్ తరవాత రిలీజైన నా సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయి.. తాప్సీ ఇప్పుడేం చేస్తుంది..? రేపేం చేయబోతుంది…? ఇలా మీడియా దృష్టి మారింది, కానీ నా వరకు ఏదీ మారలేదు… ఏదైనా మారి ఉంటే నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ మారింది. ఏ సినిమా చేయాలి.? ఏదీ చేయకూడదు క్లారిటీ వచ్చింది…

బాలీవుడ్ లో చాన్స్ వస్తే అది ప్రమోషన్ కాదు

టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేశాక బాలీవుడ్ లో చాన్స్ వస్తే అది ప్రమోషన్ అనుకుంటారు . నా వరకు అది ప్లాన్ B. ఇక్కడ నాకు చాన్సెస్ రాకపోతేనే అక్కడికి వెళ్లాను…

జుడ్వా 2 గురించి…

జుద్వా లాగే ఉంటుంది. సినిమా బేసిక్ అయిడియా సేం ఉంటుంది కానీ మూమెంట్స్, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ బ్యాక గ్రౌండ్  డిఫెరెంట్ గా ఉంటుంది. చాలా ఫన్ ఉంటుంది.

ఈ సినిమా డిసైడ్ చేస్తుంది..

టాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు చేయాలనే క్లారిటీ ఇంకా నాకు రాలేదు.. ఈ సినిమా సక్సెస్ తో నాకు క్లారిటీ వచ్చేస్తుంది.. కాబట్టి ఈ సినిమా తరవాతే ఏ డెసిషన్ అయినా తీసుకుంటాను.

 

డ్రీమ్ రోల్ అని కాదు కానీ…

ఇలాంటి క్యారెక్టర్ తప్పకండా చేయాలి.. దట్స్ మై డ్రీం రోల్ అని కాదు కానీ కానీ స్పోర్ట్స్ బేస్డ్ బయోపిక్ చేయాలని ఉంది. నేను పర్సనల్ గా అన్ని స్పోర్ట్స్ చూస్తాను.. కాబట్టి అలాంటి ఒక సినిమా చేయాలని ఉంది.

ఆ ఆలోచన లేదు…

ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు.. ఒకవేళ పెళ్ళి చేసుకున్నా యాక్టింగ్ కరియర్ వదులుకునే ఆలోచన కూడా నాకు లేదు. నా సినిమాలు ఇక ఆడవు అనిపించినప్పుడే కరియర్ వదిలేస్తాను తప్ప పెళ్ళి కోసం కాదు…