ఆనందో బ్రహ్మ - 50 రోజులు

Friday,October 06,2017 - 12:40 by Z_CLU

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది ఆనందో బ్రహ్మ సినిమా. మహి వి రాఘవ రాసుకున్న ఈ కథకు తాప్సి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, రాజీవ్ కనకాల, షకలక శంకర్ ప్రాణం పోశారు. అలా 3 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఆనందో బ్రహ్మ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయి, తాజాగా 50 రోజులు పూర్తిచేసుకుంది.

విడుదలైన మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా ఫస్ట్ వీకెండ్ కు 3 కోట్ల రూపాయల వసూళ్లు తెచ్చుకుంది. అలా వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయిన ఆనందో బ్రహ్మ సినిమా దిగ్విజయంగా 50రోజులు పూర్తిచేసుకుంది.

దర్శకుడు మహి రాసుకున్న స్టోరీలైన్ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ అయితే.. విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంశాలు టెక్నికల్ గా ఈ చిన్న సినిమాను ఉన్నతంగా నిలబెట్టాయి. 70ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది ఆనందో బ్రహ్మ మూవీ.