Banaras టైం ట్రావెల్ కథతో పాన్ ఇండియా సినిమా
Tuesday,September 27,2022 - 06:18 by Z_CLU
ప్రస్తుతం టైం ట్రావెల్ కథలతో సైన్స్ ఫిక్షన్ కథలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఒకే ఒక జీవితం సినిమా ప్రేక్షకులను టైం మిషన్ ఎక్కించి వెనక్కు తీసుకెళ్లి మెప్పించింది. ఇక కళ్యాణ్ రామ్ కూడా టైమ్ ట్రావెల్ కథతో ఇటీవలే బింబిసార తో మంచి విజయం అందుకున్నాడు. ఇప్పుడు బనారస్ అనే పాన్ ఇండియా సినిమా టైమ్ ట్రావెల్ కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతూ జయ తీర్థ దర్శకత్వంలో తెరకెక్కిన బనారస్ ట్రెయిలర్ తాజాగా రిలీజైంది. బెంగళూరులో గ్రాండ్ గా జరిగిన ఈవెంట్ లో ట్రెయిలర్ లాంచ్ చేశారు.
”నా పేరు సిద్ధు. నేనొక ఆస్ట్రోనాట్. ఐయామ్ ఎ టైమ్, ట్రావెలర్ అండ్ ఐ హేవ్ కమ్ ఫ్రమ్ ది ఫ్యూచర్” అని హీరో జైద్ ఖాన్ వాయిస్ తో మొదలైన ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ ప్రారంభంలో బనారస్ విజువల్స్ ని చూపించిన తర్వాత జైద్ ఖాన్ స్టయిలీష్ ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ మధ్య ప్రేమ సన్నివేషాలు బ్యూటీఫుల్ గా వున్నాయి. హీరోయిన్ కి హీరో ”నేను నీ ఫ్యచర్ భర్త’ని చెప్పడం ఆసక్తికరంగా వుంది. ట్రైలర్ సెకండ్ హాఫ్ లో టైం ట్రావెల్ ఎలిమెంట్ ని పరిచయం చేసిన తర్వాత ఎక్సయిటింగ్ సన్నివేశాలు థ్రిల్ చేశాయి. దిని తర్వాత వచ్చిన యాక్షన్ సీన్స్ బ్రిలియంట్ గా వున్నాయి. ఈ ట్రైలర్ తో బనారస్ పై చాలా క్యూరీయాసిటీ పెరిగింది. జైద్ ఖాన్ తన స్క్రీన్ ప్రజన్స్ ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ ని చాలా ఈజ్ తో చేశాడు. జైద్ ఖాన్, సోనాల్ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ట్రైలర్ లో చూపించిన తొలితొలి వలపే పాట రొమాంటిక్ గా ఆకట్టుకుంది. దర్శకుడు జయతీర్థ తన స్క్రీన్ ప్లే తోమ్యాజిక్ చేశారని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపధ్య సంగీతం యాక్షన్ మరింత థ్రిల్ ని ఇచ్చింది. అద్వైత గురుమూర్తి కెమరాపనితనం రిచ్ గా వుంది. ఎన్ కె ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. పాన్ ఇండియా మూవీగా వస్తున్న బనారస్ ట్రైలర్ అంచనాలని మరింతగా పెంచింది.
బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది.