#Satyadev26 ఈశ్వర్ కార్తీక్‌ దర్శకత్వంలో సత్యదేవ్ !

Monday,September 19,2022 - 11:44 by Z_CLU

Satyadev 26 With Eashvar Karthic Announced

విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులకు చేరువై విలక్షణ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్న సత్యదేవ్.. ఇప్పుడు మరో యూనిక్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

‘పెంగ్విన్’ ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సరికొత్త కథతో సినిమా చేయబోతున్నాడు. సత్యదేవ్ 26వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రం క్రైమ్ యాక్షన్ గా వుండబోతోంది. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రెడ్ థీమ్‌తో రూపొందించిన గుర్రం కనిపిస్తుంది. త్వరలోనే సినిమా లాంచ్ కానుంది. ఈ మల్టీస్టారర్ మూవీలో మరో  ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు కనిపించనున్నారు.

ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కనున్న ఈ సినిమాను బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించనున్నారు. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.