Suriya కోలీవుడ్ స్టార్ తెలుగు మూవీ ఫిక్స్ ?

Monday,July 18,2022 - 03:18 by Z_CLU

Suriya , Director Siva , UV Creations Film on cards

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్  వచ్చినప్పుడల్లా అతనికి మీడియా నుండి ఎదురయ్యే రెగ్యులర్ క్వశ్చన్  టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ? దానికి  స్క్రిప్ట్ దొరికితే త్వరలోనే అంటూ సూర్య సమాధానం వెరీ కామన్. అయితే ఇప్పుడు ఎట్టకేలకు సూర్య  తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. అవును ఇటివలే సూర్య తెలుగు ఎంట్రీ కి సంబంధించి స్క్రిప్ట్ లాక్ అయిందని తెలుస్తుంది. శివ దర్శకత్వంలో తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట సూర్య.

శివ… తెలుగు దర్శకుడే. గోపీచంద్ తో ‘శౌర్యం’, శంఖం’, రవితేజ తో ‘దరువు’ సినిమాలు చేశాడు. ఆ తర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తమిళ్ లో అజిత్ తో ఎక్కువ సినిమాలు చేశాడు. తాజాగా సూర్య కోసం శివ ఓ కథ రెడీ చేసి వినిపించాడట. దాన్ని తమిళ్ , తెలుగు బైలింగ్వెల్ లో చేయాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారని , బాల తో సూర్య చేస్తున్న సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.

ఈ కాంబో సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని సమాచారం. ఎప్పటి నుండో సూర్య తెలుగు సినిమా కోసం యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తుంది. ఫైనల్ గా ఇప్పుడు ప్రాజెక్ట్ సెట్ అయిందని తెలుస్తుంది. ప్రస్తుతం డిస్కషన్ స్టేజిలో ఉన్న ఈ కాంబో మూవీ త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics