#Major - తెరవెనక కథ చెప్పిన శేష్

Friday,November 27,2020 - 03:32 by Z_CLU

విభిన్న కథలతో హీరోగా తనకంటూ ఓ సెపరేట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న Adivi Sesh నెక్స్ట్ Major సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా ఎలా మొదలైంది తన మనసులో ఈ కథ ఎప్పటి నుంచి ఉంది లాంటి విషయాలు ప్రేక్షకులకు తెలియజేస్తూ లుక్ టెస్ట్ పేరుతో ప్రీ లుక్ రిలీజ్ చేశాడు శేష్.

Major movie Adivi Sesh

అలాగే ఓ వీడియో ద్వారా సందీప్ ఉన్ని కృష్ణన్ తల్లిదండ్రులను కలిసిన సందర్భాలను ఈ సినిమాపై వారి ఒపీనియన్ లాంటి విశేషాలను తన మాటలతో తెలియజేసాడు శేష్.

సందీప్ ఉన్నికృష్ణన్ ను సినిమాలో శేష్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాడని లుక్ టెస్ట్ చూస్తే అర్థమైపోయింది. GMB ENT, Sony Pictures, A-plus movies సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గూఢచారి ఫేం శశి కిరణ్ తిక్క దర్శకుడు.

డిసెంబర్ 17న అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.