HIT 2 నానికి రాజమౌళి సలహా
Tuesday,November 29,2022 - 12:38 by Z_CLU
SS Rajamouli to request Nani , his team for Regular Franchise
నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరనేని నిర్మాతగా అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘HIT2’డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ అందుకున్న రాజమౌళి ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అమెరికా పర్యటన ముగించుకొని రోజే ఈవెంట్ కి రావడంతో రాజమౌళి పై నాని పొగడ్తల వర్షం కురిపించాడు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ నాని అండ్ టీం కి ఓ మంచి సలహా ఇచ్చారు. ఫ్రాంచైజ్ చేయడం మాములు విషయం కాదు. చాలా టఫ్. హిట్ ఫ్రాంచైజ్ నుండి వచ్చే సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. హీరో ఎవరైనా హిట్ సిరీస్ సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారని అర్థమవుతుంది.
ప్రతీ ఏడాది ఒకే సీజన్ లో ఒకే డేట్ కి హిట్ సిరీస్ నుండి సినిమా వస్తే బాగుంటుంది. నాని, టీం ఇలా ప్లాన్ చేస్తే బెటర్ అంటూ రాజమౌళి స్పెషల్ సజిషణ్ ఇచ్చాడు. మరి జక్కన్న ఇచ్చిన ఈ సజిషణ్ హిట్ టీం తీసుకొని వచ్చే ఏడాది డిసెంబర్ లో ఇదే డేట్ కి హిట్3 ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా ? చూడాలి.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics