HIT2 అంచనాలు పెంచేసిన టీజర్

Thursday,November 03,2022 - 03:07 by Z_CLU

Adivi Sesh’s ‘HIT2’ Teaser talk

క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ హీరో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’ (Hit 2). ‘ది సెకండ్ కేస్’ (The Second Case) ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు.

‘హిట్’ లో ఫస్ట్ కేస్ అంటూ ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు చూపించి ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ ‘హిట్2’ లో కూడా మరో ఇంట్రెస్టింగ్ కేసు తీసుకున్నాడని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఒకమ్మాయిని ముక్కలు ముక్కలుగా హత్య చేయబడినమర్డర్ మిస్టరీ తో సెకండ్ కేస్ గా హిట్2 తెరకెక్కింది. ఈ మర్డర్ కేసుని కృష్ణ దేవ్ ఎలా డీల్ చేశాడు ? హంతకులను ఎలా పట్టుకున్నాడనేది ఆసక్తి కలిగించేలా ఉంది.

టీజర్ ఆరంభంలో శేష్ కేరెక్టర్ , ఆ పాత్ర ద్వారా పుట్టే ఫన్ చూపిస్తూ సినిమాలో మంచి ఎంటర్టైన్ మెంట్ ఉంటుందని చెప్తూ అలాగే  మంచి లవ్ ట్రాక్ ఉందని కొన్ని రొమాన్స్  విజువల్స్ తో చూపించారు. చివర్లో సెకండ్ కేస్ అంటూ ఓ ఇంట్లో జరిగిన అమ్మాయి మర్డర్ చూపిస్తూ ది సెకండ్ కేస్ అంటూ చూపించారు. ఓవరాల్ గా హిట్2 టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వాల్ పోస్టర్ సినిమా బేనర్ పై నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరనేని నిర్మిస్తున్న ఈ సినిమాలో శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఎం.ఎం,శ్రీలేఖ , సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజర్స్.