Chatrapathi Remake - అంతా రెడీ

Friday,November 27,2020 - 01:42 by Z_CLU

Bellamkonda Srinivas బాలీవుడ్ డెబ్యూ ఫిక్సయింది. ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన Chatrapathi సినిమా రీమేక్ ద్వారా నార్త్ ఆడియన్స్ కి పరిచయం అవ్వబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు దర్శకుడు కూడా ఫిక్సయ్యాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ను తెలుగులో హీరోగా పరిచయం చేసిన VV Vinayak ఈ రీమేక్ ను హ్యాండిల్ చేయబోతున్నాడు. వినాయక్ బాలీవుడ్ డెబ్యూ ఇదే.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. PEN Movies సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు.. మ్యూజిక్ ఎవరు అందిస్తారు లాంటి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం వినాయక్ క్యాస్టింగ్ తో పాటు టెక్నీషియన్స్ ను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. యాక్షన్ సినిమాలను పర్ఫెక్ట్ గా డీల్ చేసే వినాయక్ ఈ రీమేక్ తో బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ అందుకొని బెల్లంకొండను అక్కడ కూడా హీరోగా నిలబెడతాడేమో చూడాలి.