KGF2 - పాన్ ఇండియా మూవీ పోస్ట్ పోన్?

Friday,November 27,2020 - 03:56 by Z_CLU

సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో KGF2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో YASH హీరోగా ‘KGF’ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

ఇటివలే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఆ డేట్ కి ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

మేకర్స్ అనుకున్న డేట్ అందుకోవడానికి ఇంకా నెల రోజులే ఉంది. ఈ లోపు షూట్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసి రిలీజ్ కి రెడీ చేయడం కష్టమే అని చెప్పాలి. ప్రస్తుతం యూనిట్ మాత్రం శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.

మొన్న బెంగళూరులో దాదాపు 20 రోజుల పాటు షూట్ చేసి ఇప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ఇవాళ్టి నుండి రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

ఇప్పటికే డేట్ ప్రకటించి మళ్ళీ పోస్ట్ పోన్ చేసిన మేకర్స్ ఈ సారి కూడా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. సంజయ్ దత్ , ప్రకాష్ రాజ్ , రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.