Weekend Release- శేష్ తో విష్ణు విశాల్

Thursday,December 01,2022 - 11:37 by Z_CLU

Adivi sesh’s HIT2, Vishnu Vishal’s Matti Kusthi Releasing tomorrow

గతవారం అల్లరి నరేష్ నటించిన ‘ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ , ప్రదీప్ రంగనాథన్ నటించి దర్శకత్వం వహించిన తమిళ్ డబ్బింగ్ ‘లవ్ టుడే’ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ వారం కూడా తెలుగు సినిమాతో పాటు ఓ తమిళ్ డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతుంది.

అడివి శేష్ (Adivi Sesh) హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘ HIT2’ రేపే రిలీజవుతుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా హిట్ సిరీస్ నుండి వస్తున్న ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేశారు. రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ రావడం సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. శేష్, నాని ఈ సినిమాపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

ఇక విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా తెరకెక్కిన తమిళ్ సినిమా గట్ట కుస్తీ తెలుగులో మట్టి కుస్తీ (Matti kusthi) టైటిల్ తో డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతుంది. రవితేజ సమర్పణలో RT టీం వర్క్స్ బేనర్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదలవుతుంది. కబడ్డీ గేంతో  స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై  విష్ణు విశాల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

డిఫరెంట్ జోనర్స్ నుండి వస్తున్నఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎలా అలరిస్తాయో ? చూడాలి.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics