అడివి శేష్

Thursday,December 17,2020 - 12:16 by Z_CLU

అడివి శేష్ ప్రముఖ కథానాయకుడు, దర్శకుడు. ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి సోదరుడిగా ‘కర్మ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరోగా నటించిన అడివి శేష్ దర్శకత్వం కూడా వహించాడు.

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘పంజా’, రవితేజ హీరోగా తెరకెక్కిన ‘బలుపు’, రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాలో నటించారు.

ఆ తరవాత ‘కిస్’ అనే సినిమాలో హీరోగా నటించారు. పి.వి.పి బ్యానర్ పై రవికాంత్ పేరెపు దర్శకత్వం లో తెరకెక్కిన ‘క్షణం’ సినిమాతో హీరోగా గుర్తింపు అందుకున్నారు. ఆ తర్వాత గూఢచారి సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు.

ప్రస్తుతం మహేష్ బాబు నిర్మాతగా మేజర్ అనే సినిమా చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు