HIT 2 Trailer ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్

Wednesday,November 23,2022 - 02:47 by Z_CLU

అడివిశేష్ (Adivi Sesh) హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో నాని సమర్పణలో తెరకెక్కిన ‘HIT2 Movie’ డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు. రెండున్నర నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. టీజర్ లో లాస్ట్ షాట్ కి ట్రైలర్  లో క్లారిటీ ఇచ్చారు.

హాస్పిటల్  బయట డేడ్ బాడీ ముందు శేష్ నిలుచొని చూస్తున్న విజువల్ తో స్టార్టయిన ట్రైలర్ ఎండింగ్ లో “హెడ్ మాత్రమే సంజనది KD.. చేతులు , కాళ్లు , మొండెం వేరువేరు అమ్మాయిలవి” అంటూ తన టీం మెంబర్ చెప్పే డైలాగ్ తో సెకండ్ కేస్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. క్రిమినల్స్ అంటే కోడి బుర్ర అనుకునే కేడీ  సైకో కిల్లర్ కేసును ఎలా ఎలా చేదించాడనే ఇన్వెస్టిగేషన్ విజువల్స్ చూస్తే సినిమా గ్రిప్పింగా ఉంటూ థ్రిల్ చేయనుందని అర్థమవుతుంది.

ట్రైలర్ లో రావు రమేష్ పాత్ర అతని స్వభావాన్ని కూడా చూపించారు. అలాగే కేడీ సంజన కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక అతనిపై జరిగే ఎటాక్స్ కూడా ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ లో సినిమాటోగ్రఫీ , మ్యూజిక్ హైలైట్ గా నిలిచాయి. ట్రైలర్ అందరినీ మెప్పించేలా పర్ఫెక్ట్ గా కట్ చేశారు.

అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా  వాల్ పోస్టర్ సినిమా బేనర్ పై ప్రశాంతి త్రిపుర్నేని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ , సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics