మేజర్

Friday,November 27,2020 - 02:22 by Z_CLU

నటీ నటులు : అడివి శేష్, శోభితా ధూలిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు

నిర్మాణం: సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్‌, జి.మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

నిర్మాతలు: మహేష్ బాబు , సోనీ పిక్చర్స్

సహా నిర్మాతలు : అడివి శేష్, శ‌ర‌త్ చంద్ర‌

దర్శకత్వం – శశి కిరణ్ తిక్క

ఇండియాలో ప్ర‌ముఖ నిర్మాణ‌, పంపిణీ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌ల‌యిక‌లో `మేజ‌ర్` అనే భారీ చిత్రం రూపొంద‌నుంది. అడివి ఎంట‌ర్ టైన్మెంట్‌, శ‌ర‌త్ చంద్ర‌, ఎ+జి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

ద్వి భాషా చిత్రంగా తెలుగు, హిందీ భాష‌ల్లో భారీ బడ్జెట్‌తో నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొంద‌బోయే ఈ సినిమా శౌర్యం, త్యాగం మేళ‌వింపుగా ఇన్‌స్ఫైర్ చేసేలా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా సోనీ పిక్చ‌ర్స్ సంస్థ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. అలాగే జిఎంబి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతుంది.

Release Date : 20220603