జి.హరి

Wednesday,February 08,2017 - 05:02 by Z_CLU

జి. హరి ప్రముఖ తమిళ దర్శకుడు. ప్రశాంత్-సిమ్రాన్ నటించిన ‘తమిజ్’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తర్వాత విక్రమ్ హీరోగా ‘సామి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను ‘లక్షి నరసింహ’ పేరుతో తెలుగులో బాలకృష్ణ హీరోగా రీమేక్ అయింది. ఈ సినిమా తర్వాత ‘కోవిల్’, ‘అరుళ్’,’అయ్యా’,’ఆరు’,’తమిరాభరణి’,’వెల్’,’సేవల్’,’సింగం’,’వేంగై’,’సింగం-2′,’పూజై’,’సింగం-3 ‘ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మాస్ ఎంటర్టైనర్ సినిమాలతో పలు ఘన విజయాలు అందుకొని దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. హరి దర్శకత్వం వహించిన చిత్రాల్లో కొన్ని తెలుగులో డబ్బింగ్ సినిమాలుగా విడుదలై తెలుగులోనూ ఘన విజయాలు అందుకున్నాయి.