కె.రాఘవేంద్ర రావు

Wednesday,February 08,2017 - 05:37 by Z_CLU

కోవెలమూడి రాఘవేంద్ర రావు ప్రముఖ చలన చిత్ర దర్శకులు. మే 23, 1942లో జన్మించారు. శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన ‘బాబు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమా తరవాత ‘జ్యోతి’,’రాజా’ ,’ఆమె కథ’ వంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ‘అడవి రాముడు’,’పదహారేళ్ళ వయసు’,’డ్రైవర్ రాముడు’,’వేటగాడు’,’జస్టీస్ చౌదరి’,’దేవత’,,’అగ్ని పర్వతం’,’ఘరానా మొగుడు’,’అల్లరి ప్రియుడు’,’అల్లరి మొగుడు’,’కూలి నెంబర్ 1′,’ఘరానా బుల్లోడు’,’మేజర్ చంద్రకాంత్’,’పెళ్లి సందడి’,’అన్నమయ్య’, ‘గంగోత్రి’, ‘శ్రీ రామదాసు’ వంటి ఎన్నో సినిమాలతో ఘన విజయాలు అందుకొని టాప్ దర్శకుడిగా గుర్తింపు అందుకున్నారు. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100 కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా 7 స్టేట్ నంది అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. టాలీవుడ్ కు కమర్షియల్ హంగులద్దిన దర్శకుల్లో ఒకరు.

Born : 23 May 1942