ఎన్టీఆర్ తో పవర్ ఫుల్ సినిమా చేయాలనుంది.....

Wednesday,February 15,2017 - 09:10 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తనకిష్టమని తనతో ఓ సినిమా చేయాలనుకుంటున్నానని ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పాడు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ హరి. లేటెస్ట్ గా సూర్య తో ‘సింగం-3’ సినిమాను తెరకెక్కించిన ఈ దర్శకుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు..

singham-3-successmeet
ఇక మొన్నా మధ్య ఎన్టీఆర్ కి హరి ఒక కథ వినిపించాడని టాక్ టాలీవుడ్ లో వినిపించగా ఈ విషయమై ఆయన స్పందించారు. ఎన్టీఆర్ తో ఒక పవర్ ఫుల్ సినిమా చేయాలనుందని తెలిపాడు. మరి తనతో పనిచేయడానికి ఉవ్విల్లూరుతున్న ఈ కోలీవుడ్ డైరెక్టర్ కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడా…….