'గౌతం తిన్ననూరి' ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Thursday,March 28,2019 - 10:02 by Z_CLU

‘మళ్ళీ రావా’ తో దర్శకుడిగా పరిచయమైన గౌతం తిన్ననూరి రెండో సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. నాని తో ‘జెర్సీ’ అంటూ ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీని తెరకెక్కించిన ‘గౌతం’తో జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ.

 

అదే ఫస్ట్ టైం…

‘మళ్ళీ రావా’ సినిమా కంటే ముందే ఓ రెండు కథలు రాసుకున్నాను. అందులో ఒకటే ‘జెర్సీ’. ‘మళ్ళీ రావా’ రిలీజయిన కొన్ని నెలల తర్వాత ప్రొడ్యుసర్ వంశీ గారికి స్క్రిప్ట్ చెప్పాను. ఆయనకి స్క్రిప్ట్ బాగా నచ్చడంతో నాని గారికి చెప్పమన్నారు. అప్పుడే నాని గారిని ఫస్ట్ టైం కలిసాను. ఆయన చాలా కూల్ గా రిసీవ్ చేసుకున్నారు.

 

టెన్షన్ పడ్డాను

‘మళ్ళీ రావా’ తర్వాత ఒక ఆరు నెలల పాటు కూర్చొని బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను… స్క్రిప్ట్ ఎవరికి చెప్దామా..? అనుకుంటున్న టైంలో నా మైండ్ లో నాని గారు స్ట్రైక్ అయ్యారు. ఆ స్క్రిప్ట్ తోనే నాని గారికి రెండు గంటల పాటు కంప్లీట్ నెరేషన్ ఇచ్చాను. మొత్తం విన్నాక ఒకే బాగుంది అని చెప్పారు. కానీ సినిమా చేస్తున్నా అని ,చేయనని  ఏం చెప్పకపోవడంతో బయటికొచ్చాక కొంచెం టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత నిర్మాత వంశీ గారు నాని గారు సినిమా చేస్తున్నారని, తనతో చేద్దాం అని చెప్పారని చెప్పాక నెమ్మది పడ్డాను.

 

‘నిన్ను కోరి’ తర్వాత ఇదే…

నాని గారు అంత ఫాస్ట్ గా నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదు. ఇంకో రెండు మూడు సిట్టింగ్స్ జరుగుతాయని, మళ్ళీ నెరేషన్ ఇవ్వమంటారని ఊహించాను. కానీ ఫస్ట్ సిట్టింగ్ లోనే ఒకే చేసేసారు. ‘నిన్ను కోరి’ తర్వాత నాని ఇంత ఫాస్ట్ గా ఒకే చేసిన కథ ఇదేనని వాళ్ళ స్టాఫ్ చెప్పారు. హ్యాపీ గా ఫీలయ్యాను.

 

అలా ఉండదు

సినిమాలో హీరో కి ఎలివేషన్ సీన్స్ లాంటివి ఉండవు. హీరో కథలో ఒక క్యారెక్టర్ లా మాత్రమే కనిపిస్తాడు. అతనితో కథ ట్రావెల్ అవుతోంది. ‘లో’ లెవెల్ లో స్టార్ట్ అయ్యి హై లెవెల్ కి ఎలా వెళ్తుందనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది మాత్రం గ్యారెంటీ ఇస్తాను.

90 మందిలో ఒకడి కథ

100 మందిలో అందరూ సక్సెస్ కాలేరు. ఓ పది మంది సక్సెస్ అయితే మిగతా తొంబై మంది ఫెయిల్ అవుతారు. ఏ రంగంలో చూసుకున్నా ఇంతే అందరికీ తెలిసిందే. ఆ తొంబై మందిలో ఒకడి కథే ‘జెర్సీ’. అర్జున్ అనే ఒక క్రికెటర్ తన జీవితంలో ఎందుకు టార్గెట్ ని రీచ్ అవ్వలేక విఫలం అయ్యాడనేది సినిమా ముఖ్య కథాంశం. అర్జున్ లో మనకి ఆ తొంబై మంది కనిపిస్తారు. ఈ పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను.

 

పదేళ్ళలో…

1986 నుండి 1996 మధ్య జరిగే కథ ఇది.  అర్జున్ లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి చివరికి టాప్ క్రికెటర్ అవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. టార్గెట్ ని రీచ్ అయ్యాడా లేదా..అక్కడి వరకూ ఉంటుంది. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉంటుంది.

 

సంబంధం ఉండదు

‘జెర్సీ’ ని కొన్ని సినిమాలతో కంపేర్ చేస్తూ కొన్ని వార్తలొచ్చాయి. కానీ ఇది నేను రాసుకున్న స్టోరీ. ఏ సినిమాకు ఆదర్శం కాదు. సక్సెస్ అయిన వ్యక్తుల గురించి ఎక్కువగా వింటుంటాం.. వాళ్ళ మీదే సినిమాలు కూడా వస్తాయి. కానీ సక్సెస్ అవ్వకుండా వెనక్కి వచ్చిన వ్యక్తుల గురించి పట్టించుకోం. సక్సెస్ కాలేదని వాళ్లకి ప్రతిభ లేదనలేం… కదా. అలాంటి వ్యక్తులు అన్ని రంగాల్లో ఉంటారు..అలాంటి ఓ వ్యక్తి గురించి చెప్తే .. చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుండి పుట్టిన కథ ఇది. ఆ తర్వాత హర్ష బొగ్లె గారి ఇంటర్వ్యూ ఒకటి చూసాను. ఆయన ఆ ఇంటర్వ్యూ లో ఫెయిల్యూర్ గురించి ఓ మంచి విషయం చెపారు. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత పూర్తి స్క్రిప్ట్ వర్క్ చేశాం.

 

ఇప్పుడు వరుసగా…

నాకు తెలిసి తెలుగులో ‘అశ్విని’,’సై’,’గోల్కొండ హై స్కూల్’ లాంటి కొన్ని మాత్రమే స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలొచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అలాంటి క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలు వరుసగా వస్తున్నాయి. తెలుగులో ‘మజిలీ’, ‘డియర్ కామ్రేడ్’, పుల్లెల గోపి చంద్ బయోపిక్, తమిళ్ లో విజయ్ గారు చేస్తున్న ఓ సినిమా… ఇలా కొన్ని స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలొస్తున్నాయి. కో ఇన్సిడెంట్ గా అన్నీ ఒకే సారి వస్తున్నాయి. ఒక విధంగా ఇది మంచి పరిణామనే చెప్పొచ్చు. తెలుగులో మరిన్ని క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలు రావాలి.

78 డేస్ లో….

కథ రాసుకున్నప్పుడు, షూటింగ్ కి వెళ్ళినప్పుడు అనుకున్న రోజుల్లో తెరకెక్కించగలమా..? అనే సందేహం ఉండేది. కానీ అందరి సపోర్ట్ తో 78 డేస్ లోనే ఫినిష్ చేశాం. ఉప్పల్ స్టేడియం , ఎల్.బి.స్టేడియం తో పాటు జింఖానా గ్రౌండ్ లోనూ అలాగే కొన్ని హైదరాబాద్  లోకల్ ఏరియాలో ఉండే గ్రౌండ్స్ లోనూ షూట్ చేసాం.

 

నాని సూపర్బ్… బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది.

ఈ సినిమా కోసం డానియల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడం దగ్గర నుండి సినిమా పూర్తయ్యే వరకూ నాని గారు చాలా కష్టపడ్డారు. నటుడిగా అయన డెడికేషన్ లెవెల్ కి టీం అందరం ఫిదా అయ్యాం. షూట్ లో దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా వర్క్ చేసారు. సినిమాలో అర్జున్ గా కనిపించడానికి నాని గారు చేసిన హార్డ్ వర్క్ సూపర్బ్. కచ్చితంగా ఆయన కెరీర్ లో అర్జున్ బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటవుతుంది.

 

తనే బెటర్

హీరోయిన్ ఎవరైతే బాగుంటుందా..? అని కొందర్ని ఆప్షన్స్ అనుకున్నప్పుడు అందరికీ శ్రద్దా శ్రీనాథ్ బెటర్ అనిపించింది. అందంతో పాటు బాగా నటిస్తుందనే ఉద్దేశ్యంతోనే తనని హీరోయిన్ గా తీసుకున్నాం. తెలుగులో తనకి మంచి డెబ్యూ ఫిలిం అవుతుంది.

 

సత్య రాజ్ బెస్ట్ అంతే

బాహుబలి తర్వాత సత్య రాజ్ తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. కథ చెప్పగానే తప్పకుండా చేస్తానని అన్నారు. కథలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్  ఆయనది. అర్జున్ కి ఓ క్రికెట్ కోచ్ గా కనిపిస్తారు. చిన్నతనం నుండి అర్జున్ ని గొప్ప క్రికెటర్ గా తీర్చిదిద్దాలని చూస్తుంటారు. వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి.

బిగ్గెస్ట్ అచీవ్ మెంట్

ఒక సినిమాలో ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయితే డైరెక్టర్ సక్సెస్ అయినట్టే.. అదే నమ్ముతాను. జెర్సీ లో ఉండే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే అదే నాకు బిగ్ అచీవ్ మెంట్ .

నాకు చాలా ఇష్టం

అనిరుద్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం.. స్టోరీ అనుకున్నప్పుడు ఈ సినిమా మూడ్ ని అనిరుద్ తన మ్యూజిక్ తో క్యారీ చేస్తాడని అనుకొని అందరం కలిసి కాల్ తీసుకున్నాం. మేం ఊహించినట్లే బెస్ట్ ఇచ్చాడు. అదేంటో గానీ , జెర్సీ అంథెం సాంగ్స్ బాగా రీచ్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు.


అది చాలా కష్టం …

నార్మల్ గా రాసుకున్న కథను మనం ఎలాగైనా తీయొచ్చు. కానీ క్రీడా నేపథ్యంతో కథను నడిపించాలంటే సాహసమే. ఈ సినిమాతో అది నాకు బాగా తెలిసొచ్చింది. ఒక మ్యాచ్ లో మనోళ్ళు నెగ్గారని చెప్పడం ఇన్ఫర్మేషన్. కానీ నెగ్గాలి నెగ్గాలి అని క్యూరియాసిటీ రైజ్ చేయాలంటే ఎమోషన్ ని స్పోర్ట్ లోకి తీసుకురావాలి అది ఈజీ కాదు. జెర్సీ నాకది నేర్పింది.

 

నవ్వొస్తుంది..

ఈ మధ్య కొందరు సినిమాలో హీరో చనిపోతారట కదా… సాడ్ ఎండింగ్ ఉంటుందంట నిజమేనా, ‘జెర్సీ’ ఫలానా క్రికెటర్ బయోపిక్ అంట కదా   అని రకరకాలుగా అడుగుతున్నారు. అవన్నీ విని నాకు నిజంగా నవ్వొస్తుంది. అందులో నిజం లేదు. కచ్చితంగా ఎవరూ ఊహించని క్లైమాక్స్ తో సినిమా ఎండ్ అవుతుంది. అదేంటనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

 

అదే టార్గెట్

కొన్ని సినిమాలను అందులోని క్యారెక్టర్స్ ని మనం ఆదర్శంగా తీసుకొని ముందడగుగేస్తాం.. కచ్చితంగా జెర్సీ అలాంటి సినిమా అవుతుంది. మా టార్గెట్ కూడా అదే. ఏప్రిల్ 19 న అర్జున్ ని కలిసి కొందరైనా ఇన్స్పైర్ అయితే మేం సక్సెస్ అయినట్టే.