దర్శకుడికి కార్ ను గిఫ్ట్ ఇచ్చిన సూర్య

Wednesday,February 15,2017 - 06:28 by Z_CLU

ఈ మధ్య తమకి గ్రాండ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ ను కాస్ట్లీ గిఫ్ట్ తో సప్రయిజ్ చేస్తూ ఎంకరేజ్ చెయ్యడం కాస్త ఆనవాయితీగా మారింది. ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు తనకి ‘శ్రీమంతుడు’ లాంటి గ్రాండ్ హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాలకి ఆడి కార్ ను గిఫ్ట్ ఇవ్వగా లేటెస్ట్ గా ఎన్టీఆర్ కూడా ‘జనతా గ్యారేజ్’ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో కొరటాలకి 20 లక్షల కాస్ట్లీ వాచ్ ను గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సూర్య కూడా దర్శకుడు హరికి ఒక కార్ ను గిఫ్ట్ గా ఇచ్చి సప్రయిజ్ చేసాడు..

surya-dgifted-car-to-hari

లేటెస్ట్ గా హరి డైరెక్షన్ సూర్య నటించిన ‘సింగం-3’ మాస్ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తూ 100 కోట్ల క్లబ్ లో చేరడంతో తనకి ఇంతటి గ్రాండ్ హిట్ అందించిన హరికి ప్రత్యేకంగా ఇంటికెళ్లి ఇలా కార్ గిఫ్ట్ ఇచ్చి స్పెషల్ థాంక్స్ చెప్పాడట సూర్య..