'సతీష్ వేగేశ్న' ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Tuesday,August 14,2018 - 08:10 by Z_CLU

‘శతమానం భవతి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న ‘శ్రీనివాస కళ్యాణం’ అంటూ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈ సినిమా గురించి దర్శకుడు సతీష్ వేగేశ్న ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

 

టార్గెట్ రీచ్ అయ్యాం.

‘శ్రీనివాస కళ్యాణం’ అనే టైటిల్ తో పెళ్లి గొప్పతనాన్ని చెప్పాలనుకున్నాం. మన ఇంట్లో జరిగే పెళ్ళికి కుటుంబమంతా ఎలాగైతే తరలి వస్తారో.. పెళ్లి వేడుకతో తెరకెక్కిన ఈ సినిమాకు కూడా కుటుంబ సబ్యులందరూ అలాగే తరలి వస్తారన్న ఉద్దేశ్యంతోనే తెరకెక్కించాం. కాని మొదటి రోజు మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ రాకపోగా వచ్చిన యూత్ ఆడియన్స్ కి సేటిల్డ్ లవ్ స్టోరీ , పెళ్లి గురించి గొప్పగా చెప్పిన కొన్ని విషయాలు నచ్చలేదు. వారికి అనిపించింది చెప్తూ తొలి రోజు సోషల్ మీడియా ద్వారా నెగిటీవ్ టాక్ స్ప్రెడ్ చేసారు. నిజానికి మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చింది. తొలి రెండు రోజులు తర్వాత శనివారం నుండి ఫ్యామిలీస్ థియేటర్స్ కి రావడం మొదలు పెట్టారు. కొందరు ప్రత్యేకంగా ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడుతున్నారు. సో ఫైనల్ గా మా టార్గెట్ రీచ్ అయ్యాం.

 

సినిమా ఇంపాక్ట్ అలా ఉంది

కొంత మంది డెస్టినేషన్ పెళ్ళిళ్ళను ఇష్టపడే వారు ఈ సినిమా చూసి మా అమ్మాయి పెళ్లి ఇలాగే చేస్తాం , మా అబ్బాయి పెళ్లి గోవాలో అనుకున్నాం కాని సినిమా చూసాక ఇక్కడే మా ఇంటి ముందు పెట్టుకుంటున్నాం. మీరు కచ్చితంగా మా అబ్బాయి పెళ్ళికి రావాలి అంటూ కొందరు ఫోన్ చేసి చెప్తుంటే ఆనందంగా ఉంది. మేము చెప్పాలనుకున్న పాయింట్ అందరికీ కనెక్ట్ అయింది.

ఆ ట్వీట్లు చూసి ఎనర్జీ వచ్చింది.

తొలి రోజు సినిమా చూసిన యూత్ ఆడియన్స్ కొందరు సినిమా పెళ్లి క్యాసెట్టు లా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. నిజానికి నీకు సినిమా నచ్చలేదు కానీ, మరికరికి నచ్చొచ్చేమో.. అవన్నీ పట్టించుకోకుండా ఎవరికీ అనిపించింది వారు సోషల్ మీడియా ద్వారా నెగిటీవ్ టాక్ స్ప్రెడ్ చేసారు. ఇటివలే కొందరు సినిమా బాగుంది… ట్విట్టర్ లో చెప్తునట్టుగా అంత చెత్తగా ఏం లేదు అంటూ సినిమా చూసి నచ్చిన ప్రేక్షకులు పోస్టులు పెడుతున్నారు.

 

‘శతమానం భవతి’ కి కూడా ఇదే జరిగింది.

శతమానం భవతి మొదటి రోజు ఫామిలీస్ చూసి బాగుందని చెప్పగా కొందరు మాత్రం టి.వీ సీరియల్ లా ఉందన్నారు. రేటింగులు కూడా పెద్దగా పడలేదు. కానీ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యి హిట్ నుండి సూపర్ హిట్ , సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది.

 

కన్ఫ్యూజన్ లో పడేసింది

నిజానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి నుండే మంచి సినిమా అని అందరూ అంటూనే పనిచేసారు. ప్రిమియర్ కి కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. కాని తీరా రిలీజ్ రోజు చూస్తే మిక్సిడ్ టాక్ వచ్చింది. బాగుందని కొందరు చెప్తుంటే బాగాలేదు అని కొందరు అన్నారు. దిల్ రాజు గారితో సహా అందరం కన్ఫ్యూజన్ లో పడిపోయాం. ఒకవైపు సోషల్ మీడియాలో సినిమా గురించి ట్రోల్స్ చూసి బాధ పడాలా… ఫ్యామిలీ ఆడియన్స్ మెసేజులకు కాల్స్ కి ఆనందపడాలా… అసలు సినిమా హిట్టా..ఫట్టా తెలియని కన్ఫ్యూజన్ లో పడిపోయాం. ఇక జెన్యూన్ ఫీడ్ బ్యాక్ కోసం ప్రతీ థియేటర్స్ దగ్గర మూడు బాక్సులు పెట్టి ఒక పోల్ పెట్టడం జరిగింది. అందులో 70 % ఆడియన్స్ చాలా బాగుంది అని రాసారు. నిజానికి 20 ఏళ్ల నా కెరీర్ లో హిట్ ఫ్లాప్ తెలుసుకోలేని కన్ఫ్యూజన్ లో పడేసింది శ్రీనివాస కళ్యాణం.

 

మిస్ ఫైర్ అయ్యింది

సినిమాలో ఎనర్జిటిక్ లవ్ స్టోరీ ఉంటే కథను, అలాగే హీరో క్యారెక్టర్ ని డిస్టర్బ్ చేస్తుందనే ఉద్దేశ్యంతోనే సెటిల్డ్ లవ్ స్టోరీ పెట్టడం జరిగింది. అది సినిమాకి మైనస్ అవ్వకూడదని అనుకుంటే అదే సినిమాకు మైనస్ అంటున్నారు. సో అక్కడ మిస్ ఫైర్ అయ్యింది.

 

ఆ కథ వేరు.. ఈ కథ వేరు

ఈ సినిమాకెళ్ళే ముందు ‘శతమానం భవతి’ ని ఊహించుకొని వెళ్లి, బయటికొచ్చాక ‘శతమానం భవతి’ రేంజ్ లో లేదు అంటున్నారు. నిజానికి ఆ కథ వేరు ఈ కథ వేరు. తమకు దూరంగా ఉంటున్న ఒక తల్లి తన పిల్లల్ని చూడాలనుకునే కథ అది… పెళ్ళంటే జస్ట్ ఈవెంట్ అనుకునే తండ్రి తన కూతురు పెళ్లి చేస్తూ పెళ్లి గొప్పతనాన్ని తెలుసుకునే కథ ఇది. రెండింటికి చాలా తేడా ఉంది. అందులో కేవలం ఓ 12 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి.. ఇది పెళ్ళికి సంబందించిన కథ కాబట్టి చాలా మంది ఉంటారు. ఆర్టిస్టులందరినీ పూర్తిగా వాడుకోలేక పోయాను కానీ కథలో భాగంగా అందరికీ ఒక్కో సన్నివేశంతో వారికున్న ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేశాను.

 

రివ్యూలు అవసరమే

నిజానికి సినిమాకు సంబంధించి రివ్యూ లు అవసరం… అవి చదివి మనం చేసిన మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని రియలైజ్ అవ్వాలి. కాని రేటింగ్ ను మాత్రం పట్టించుకోను.

 

ఎన్.టి.ఆర్ రిజెక్ట్ చేయలేదు

ముందుగా ఈ సినిమా పాయింట్ తో పాటు కొన్ని సీన్స్ ఎన్.టి.ఆర్ కి చెప్పడం జరిగింది. ఆయన వినగానే చాలా బాగుంది.. కానీ నా ఇమేజ్ కి సూట్ అవుతుందా…? నాకు తగ్గుట్టుగా డెవలప్ చేస్తే బెటర్ అని చెప్పారు. మాకు కూడా అదే అనిపించింది. తర్వాత ఎన్టీఆర్ గారు బిజీ గా సినిమాలు చేస్తుండడం, మేము కూడా యంగ్ హీరోతోనే ఈ కథను బాగుంటుందని డిసైడ్ అవ్వడంతో అప్పుడు నితిన్ కు స్టోరీ వినిపించాను. స్టోరీ వినగానే నితిన్ సినిమా చేస్తున్నాం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. కేవలం సినిమా చేయడమే కాకుండా తన కెరీర్ లో ఇది మంచి సినిమాగా నిలిచిపోతుందని ప్రతీ సారి చెప్పడం సంతోషం.

రైటర్ అయితే అదే ప్లస్

నిజానికి కొన్ని సందర్భాల్లో దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ ప్రసంశలు అందుకుంటుంటాం. శతమానం భవతి సినిమాకి రచయితగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలకు క్లాప్స్ కొడుతున్నారు. రైటర్ డైరెక్టర్ అయితే అదే ప్లస్.

 

మెలో డ్రామా అయ్యేది.

గిరిబాబు లాంటి సీనియర్ నటుడు విడిపోయిన చుట్టంగా పెళ్ళికి వచ్చే సీన్ ఓ సాంగ్ లో పెట్టడం బాలేదని కొందరు చెప్పారు. నిజమే ఆయన్ను ఆ సాంగ్ లో అలా తీసుకురావడం కొందరికి నచ్చలేదు. కానీ ఆయన వచ్చి జయసుధ గారితో మాట్లాడి అక్కడ ఒక ఎమోషనల్ సీన్ పెడితే మెలో డ్రామా అయ్యుండేది. అందుకే ఆ సన్నివేశాన్ని ఒక పాటలో పెట్టడం జరిగింది. ఆ సన్నివేశానికి ముందు మీ పెళ్ళిలో మా 70 జీవితాన్ని చూసుకుంటాం అని జయసుధ గారు నితిన్ తో చెప్పే డైలాగ్ ఉంది కదా ఇంక ఆ సన్నివేశాలు అనవసరం అనిపించింది. ఇదే కాదు కథకు అవసరమైన సన్నివేశాలు మాత్రమే షూట్ చేసాం. ఎక్కడా మెలో డ్రామా లేకుండా చూసుకున్నాను.

 

సమీర్ గారికి స్క్రిప్ట్ ఇస్తే చాలు

సమీర్ రెడ్డి గారితో మళ్ళీ ఈ సినిమాకు పనిచేయడం సంతోషంగా ఉంది. షూటింగ్ కి వెళ్ళే ముందు ఆయనకు స్క్రిప్ట్ ఇస్తే చాలు నోట్స్ రాసుకొని ప్రతీ సీన్ మైండ్ లో పెట్టేసుకుంటారు. దానితో మనం ఆయనకీ పెద్దగా చెప్పే పని ఉండదు. స్క్రిప్ట్ మొత్తం తెలుసు కాబట్టి ఆయన ఫోకస్ అంతా షాట్స్ మీదే ఉంటుంది. ఈ సినిమాను ఆయన సినిమాటోగ్రఫీ తో మరింత అందంగా చూపించి సినిమాకు ఓ గ్రాండియర్ లుక్ తీసుకొచ్చారు.

ఆయన ఇన్వాల్వ్ మెంట్ అవసరమే

నిజానికి రాజు గారు దర్శకులకు ఫ్రీడం ఇవ్వరూ అన్నది అవాస్తవం… సినిమాను అమితంగా ప్రేమించే నిర్మాత ఆయన. కాకపోతే నా సినిమాలంటే ఆయనకు మరింత ఇష్టం. ఫ్యామిలీ సినిమా మీద ఉన్న ఆసక్తితో కాస్త మా సెట్ లో ఎక్కువగా గడుపుతుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్ పుట్స్ ఇస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. నిర్మాతగా ఇన్ పుట్స్ ఇస్తారే తప్ప మిగతా వాటిలో ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఉండదు. ఆయన సెట్ లో ఉంటే నా పని చాలా ఈజీ అయిపోతుంది.

 

ప్రకాష్ రాజు గారు క్లైమాక్స్ మారిస్తే బెటర్ అన్నారు

సినిమా అనేది పనిచేసిన ప్రతీ ఒక్కరికీ సక్సెస్ అందించే మాధ్యమం. ఒక్కోసారి అందరి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించాలి. శతమానం భవతి షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రకాష్ రాజ్ గారు క్లైమాక్స్ మారిస్తే బెటర్ ఇలా రాస్తే బాగుంటుదేమో అంటూ ఓ చిన్న సజెషన్ ఇచ్చారు. ఆ రోజు నిజమేనేమో ఆయనే కరేక్టేమో అనిపించి ఆ మరుసటి రోజు తెల్లవారి జామున మూడింటికి లేచి మరో వర్షన్ రాసాను. కానీ దాని కంటే ముందు అనుకున్న క్లైమాక్సే బెటర్ అనిపించింది. వెంటనే ప్రకాష్ రాజ్ గారికి చెప్తే, ఓకె జస్ట్ నాకెందుకో అలా అనిపించింది. పరవాలేదు ఎలా అయితే ఏముంది సినిమా హిట్టవ్వాలి నీకు మంచి పేరు రావాలి అన్నారు. నిజానికి సినిమా విషయంలో ఎవరు ఏ సలహా ఇచ్చిన దర్శకుడిగా స్వీకరించాలి.

 

వాళ్ళ సపోర్ట్ మర్చిపోలేను

ఈ సినిమా మొదటి రోజు వచ్చిన డివైడ్ టాక్ విని జయసుధ గారు, నరేష్ గారు ఇంకొంతమంది ఆర్టిస్టులు నా శ్రేయోభిలాషులు  నాకు ఫోన్ చేసి దర్శకుడిగా మంచి సినిమా తీసావు… జనాలకు మంచి రీచ్ అవ్వడానికి కొన్నిసార్లు టైం పడుతుంది. అంటూ ఎంతో అభినందిస్తూ మాట్లాడారు. నిన్న జరిగిన మీడియా మీట్ లో కూడా రాజు గారు మా కాంబినేషన్ లో మరో సినిమా అనౌన్స్ చేయడం , నితిన్ తో పాటు ఆర్టిస్టులందరూ నా పక్కన వచ్చి  నిల్చోవడం ఎంతో ధైర్యాన్నిచ్చింది.

 

ఇంకా క్లారిటీ లేదు

‘శతమానం భవతి’ తర్వాత దుర్గా ఆర్ట్స్ లో ఓ సినిమా కమిట్ అయ్యాను. కాని అనుకోకుండా వెంటనే రాజు గారితో ఈ సినిమా చేయాల్సి వచ్చింది. దుర్గా ఆర్ట్స్ లో ఓ సినిమా అలాగే రాజు గారి బ్యానర్ లో థాంక్యూ (మీకెలా చెప్పాలో) అనే సినిమా కూడా చేస్తున్నాను. రెండింటిలో ఏది ముందు అన్నది ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే నెక్స్ట్ సినిమా గురించి ప్రకటిస్తాను.