జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,June 23,2019 - 10:12 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి. అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

ప్రియదర్శి హీరోగా ‘చింతకింది మల్లేశం’ కథతో తెరకెక్కిన ‘మల్లేశం’ ఈ రోజే విడుదలైంది. రిలీజ్ కి ముందే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ బయోపిక్ అందరినీ మెప్పించిందా… జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పొలిశెట్టి. ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ డిటెక్టివ్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఫస్ట్ ర్యాంక్ రాజు.. టైటిల్ లోనే హీరో క్యారెక్టర్ కనిపిస్తోంది. కానీ అసలు కథ వేరే ఉంది. ఇప్పుడున్న విద్యా వ్యవస్థపై సెటైరిక్ గా తీసిన సినిమా ఇది. కన్నడ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఇంతకీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

చాలామంది ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా అక్కినేని అభిమానులు కోరుకున్న కాంబినేషన్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. నాగచైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా రాబోతోంది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీదేవీ మూవీస్ అధినేత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆదిత్య మ్యూజిక్ ఇంటియా ప్రై.లి ప‌తాకంపై డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా జాతీయ అవార్డ్ విన్న‌ర్ స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఉమేశ్ గుప్తా నిర్మాత‌.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మిల్కీ బ్యూటీ లీడ్ రోల్ లో రాజుగారి గది-3 మొదలైంది. దిల్ రాజు క్లాప్ తో ఈ సినిమా ఈరోజు లాంఛనంగా మొదలైంది. నాగార్జునకు ఈ పార్ట్-3కి ఎలాంటి సంబంధం లేదు. ఓంకార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అతడి తమ్ముడు అశ్విన్ హీరోగా నటించబోతున్నాడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి