షూటింగ్ అప్ డేట్స్

Sunday,June 23,2019 - 11:06 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా, మరి కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

చిరంజీవి కధానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’సినిమా షూటింగ్ కి సంబంధించి ప్యాచ్ వర్క్ కోకాపీట్ లో జరుగుతుంది. చిరంజీవి, తమన్నా, బ్రహ్మజీ పాల్గొంటున్నారు. ఈ నెల 23 తో టోటల్ షూటింగ్ పూర్తి కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.


సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమా షూటింగ్ ప్రస్తుతం అస్ట్రియాలో జరుగుతుంది. ప్రభాస్ -శ్రద్దా కపూర్ లపై ఓ పాటను షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ తో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 15 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ “ఆర్ ఆర్ ఆర్” సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. 24 నుంచి చరణ్ షూట్ లో పాల్గొంటారు. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జులై లో సినిమా విడుదల కానుంది.


అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని- గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ హౌస్ సెట్ లో జరుగుతుంది. ఈ షెడ్యుల్ పూర్తి చేసి జులై 5 పొల్లాచి బయలుదేరనున్నారు యూనిట్. అక్కడ ఒక 20 రోజుల పాటు కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేయనున్నారు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజర్.

అక్కినేని నాగార్జున హీరోగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన్మథుడు 2’ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో కుటుంబ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు.


విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హీరో’ సినిమా షూటింగ్ ఢిల్లీ లో జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

నాని- విక్రమ్ కుమార్ కాంబోలో వస్తున్న “గ్యాంగ్ లీడర్” సినిమా షూటింగ్ ప్రస్తుతం తుఫ్రాన్ లో జరుగుతుంది. అక్కడ కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ఆగస్ట్ 30 న ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.