రాజుగారి గది-3 మొదలైంది

Thursday,June 20,2019 - 12:23 by Z_CLU

మిల్కీ బ్యూటీ లీడ్ రోల్ లో రాజుగారి గది-3 మొదలైంది. దిల్ రాజు క్లాప్ తో ఈ సినిమా ఈరోజు లాంఛనంగా మొదలైంది. నాగార్జునకు ఈ పార్ట్-3కి ఎలాంటి సంబంధం లేదు. ఓంకార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అతడి తమ్ముడు అశ్విన్ హీరోగా నటించబోతున్నాడు.

రాజుగారి గది సినిమాకు పార్ట్-2కు ఎలాంటి సంబంధం లేనట్టే…. రాజుగారి గది-2కు, ఈరోజు లాంఛ్ అయిన పార్ట్-3కి కూడా కథాపరంగా ఎలాంటి పోలికలు లేవు. హారర్-థ్రిల్లర్ ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయి, కథ మాత్రం వేరు. స్టోరీ మొత్తం తమన్నా చుట్టూ తిరుగుతుంది.

రేపట్నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాకు ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఓంకార్ కు చెందిన ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందించబోతున్నాడు.

అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ ఇతర ముఖ్యపాత్రలు పోషించబోతున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడ్ని ఇంకా సెలక్ట్ చేయలేదు. తమన్ కోసం ట్రై చేస్తున్నట్టు టాక్. ఎందుకంటే రాజుగారిగది-2కు తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు మరి.