పూర్ణ

Wednesday,November 16,2016 - 07:40 by Z_CLU

పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం. జనవరి 23, 1984లో జన్మించారు. ‘మంజు పోలోరు పెంకుట్టి’ చిత్రం తో మలయాళ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తో కథానాయికగా గుర్తింపు అందుకొని మలయాళం లో ‘డిసెంబర్’,’ఒరువన్’ వంటి పలు వరుస మలయాళ చిత్రాలలో నటించారు. ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రం తో కథానాయికగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తారువాత మళ్ళీ వరుస మలయాళ చిత్రాల్లో నటించిన పూర్ణ ‘మునియండి విలంగిల్ మూన్ఱామందు’ చిత్రం తమిళ పరిశ్రమ కు పరిచయం అయ్యారు.ఈ చిత్రం తరువాత ‘కోడై కెనాల్’ ,’కంద కొట్టై’ వంటి తమిళ చిత్రాల్లో నటించారు. ‘జోష్’ చిత్రం తో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తరువాత వరుసగా మలయాళం, తమిళ్ చిత్రాల్లో నటించిన పూర్ణ ‘సీమ టపాకాయ్’ చిత్రం తో తెలుగు కథానాయికగా గుర్తింపు అందుకున్నారు. ఈ చిత్రం తరువాత ‘లడ్డు బాబు’, ‘నువ్వలా-నేనిలా”అవును’,’అవును-2 ‘ కథానాయికగా నటించారు. మహేష్ కథానాయకుడిగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం లో పాట లో నర్తించారు.’రాజు గారి గది’, ‘మామ మంచు అల్లుడు కంచు’, వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్ర పోషించారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి కథానాయకుడిగా తెరకెక్కిన ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ చిత్రం లో కథానాయికగా నటించారు.