వీకెండ్ రిలీజెస్

Thursday,November 24,2016 - 03:20 by Z_CLU

ఈ వారం రెండు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ జంటగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ తో పాటు శివ కార్తికేయన్, కీర్తి సురేష్ నటించిన ‘రెమో’. చూస్తుంటే ఈ వారం రిలీజుల బరిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ రెండు సినిమాల హవా నడిచేటట్టే అనిపిస్తుంది.

శివరాజ్ కనుమూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాని సతీష్ కనుమూరి తో పాటు డైరెక్టర్ శివరాజు కూడా కలిసి నిర్మించారు. కాగా రెమో సినిమాని దిల్ రాజు తెలుగులో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకు బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించాడు.