వాళ్ళ మాటలు వినుంటే బుక్ అయ్యేదాన్ని....

Thursday,November 24,2016 - 06:49 by Z_CLU

హీరోయిన్ పూర్ణ బాంబ్ పేల్చింది. ఇండస్ట్రీలో తనను కొందరు వ్యక్తులు కావాలనే తప్పుదోవ పట్టించారని బ్రేకింగ్ న్యూస్ బయటపెట్టింది. వాళ్ల పేర్లు బయటపెట్టకపోయినప్పటికీ… తెరవెనక జరిగిన కహానీ మొత్తాన్ని వినిపించింది పూర్ణ. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో మరోసారి థియేటర్లలోకి వస్తున్న పూర్ణ.. ఆ సినిమా చేయొద్దని తనను చాలామంది ఉచిత సలహాలు ఇచ్చారని.. వాళ్ల మాటలు నమ్మి ఉంటే ఓ మంచి సినిమా మిస్ అయిపోయేదాన్నని ప్రకటించింది.

   ఈ సినిమా గురించి దర్శకుడు శివరాజ్ నాకు చెప్పినప్పుడు చాలా మంది ఈ సినిమా అవసరమా? పైగా శ్రీనివాస్ రెడ్డి సరసన హీరోయిన్ గా? చేస్తావా? అని సలహాలు ఇచ్చారట. అయితే వాళ్ల మాటల వినకపోవడం వల్ల ఇప్పుడు ఓ మంచి సినిమా చేసిన అనుభూతి కలుగుతోందని పూర్ణ చెప్పుకొచ్చింది.