అనుకున్నదే జరిగింది.. కట్ చేశారు..

Sunday,November 27,2016 - 11:34 by Z_CLU

శ్రీనివాస రెడ్డి-పూర్ణ జంటగా తెరకెక్కిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “జయమ్ము నిశ్చయమ్ము రా” తాజాగా థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా… లెంగ్త్ విషయంలో మాత్రం బోర్ కొట్టించిందంటూ రివ్యూస్ వచ్చాయి. అందరి అభిప్రాయాల్ని గౌరవించిన చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి వెంటనే సినిమా నుంచి 15 నిమిషాల సన్నివేశాల్ని తొలగించారు.

jayammu-nischayammu-raa
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి మాట్లాడుతూ.. “మా సినిమా విడుదలకు రెండ్రోజుల ముందే “పబ్లిక్ ప్రీమియర్స్” నిర్వహించాం,  సినిమా చూసిన వాళ్ళందరూ “సినిమా చాలా బాగుంది” అంటూ మా యూనిట్ ని అభినందించారు. అయితే.. ఈ చిత్రాన్ని చూసిన మీడియా మిత్రుల సలహా మేరకు 15 నిమిషాల సినిమాను కత్తిరించాం. ఇప్పటికే మా చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షకులు.. నిడివి తగ్గించిన తర్వాత పోసాని-కృష్ణ భగవాన్ ల కామెడీ ఎపిసోడ్స్, జోగి బ్రదర్స్ పంచ్ డైలాగ్స్ ను ప్రేక్షకులు ఇంకా బాగా ఎంజాయ్ చేసేలా ఉంటాయి”  అన్నారు.