పెద్ద నోట్ల రద్దు తో టాలీవుడ్ లో దాదాపు చాలా సినిమాల రిలీజ్ లు పోస్ట్ ఫోన్ అయ్యాయి. అయితే శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కే వస్తానంటున్నాడు. నోట్ల రద్దు తరువాత నాగ చైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో థియేటర్స్ లో అడుగుపెట్టగా, తాజాగా నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వీరిద్దరు తప్ప మిగతావారంతా తప్పుకుంటుంటే… శ్రీనివాసరెడ్డి మాత్రం జయమ్ము నిశ్చయమ్మురా అంటున్నాడు. తన కొత్త సినిమాతో చెప్పిన టైమ్ కు వస్తానంటున్నాడు.
కథానాయకుడిగా ‘గీతాంజలి’ సినిమా తో విజయం అందుకున్న శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమా తో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రిలీజ్ కి ముందే స్టార్ డైరెక్టర్స్, ప్రముఖులను ఆకట్టుకున్న ఈ చిత్రం వచ్చే శుక్రవారం విడుదల కానుంది. దేశవాళీ వినోదం అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో పూర్ణ హీరోయిన్ గా నటించింది.