జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,January 26,2020 - 10:00 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి ? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు’ వీక్లీ రౌండప్’.

గతేడాది గ్యాప్ ఇచ్చిన రవితేజ ‘డిస్కో రాజా’ తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో మాస్ మహారాజా హిట్ కొట్టి ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడా ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వచ్చింది. మూవీ ఇలా సెట్స్ పైకి రావడమే ఆలస్యం.. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. వెంకీ కొత్త సినిమాకు నారప్ప అనే టైటిల్ పెట్టారు. ఓల్డ్ వారియర్ గెటప్ లో వెంకీ లుక్ అదిరింది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా మారాడు. ఉప్పెన అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ లోగోను నిన్న రిలీజ్ చేశారు. ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సముద్ర తీరంలో వైష్ణవ్ తేజ్ నిల్చున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నాగశౌర్య యాక్షన్ లుక్ లోకి మారిపోయాడు. ఇన్నాళ్లూ క్యూట్ గా పక్కింటి కుర్రాడిలా, లవర్ బాయ్ గా అలరించిన ఈ హీరో, ఇప్పుడు అశ్వథ్థామ సినిమాతో కంప్లీట్ యాక్షన్ మూడ్ లోకి వచ్చేశాడు. బాగా ఎక్సర్ సైజులు చేసి సిక్స్ ప్యాక్ కూడా సాధించాడు. తన కుటుంబాన్ని కాపాడుకునే అశ్వథ్థామగా మారడంతో పాటు.. ఓ సీరియల్ కిల్లర్ అంతు చూసే అవతారం ఎత్తాడు. ట్రైలర్ రివ్యూ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.