వేసవిలో ముంచెత్తనున్న 'ఉప్పెన'

Thursday,January 23,2020 - 04:35 by Z_CLU

సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా మారాడు. ఉప్పెన అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ లోగోను నిన్న రిలీజ్ చేశారు. ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సముద్ర తీరంలో వైష్ణవ్ తేజ్ నిల్చున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు.

ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది ఉప్పెన. ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 2న థియేటర్లలోకొస్తోంది ఉప్పెన.

క్రితి షెట్టి హీరోయిన్ గా పరిచయమౌతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవిశ్రీతో పాటు నవీన్ నూలి (ఎడిటర్), రామకృష్ణ (ఆర్ట్), శ్యామ్ దత్ (కెమెరా) లాంటి టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.