అశ్వథ్థామ ట్రయిలర్ రివ్యూ

Thursday,January 23,2020 - 06:03 by Z_CLU

నాగశౌర్య యాక్షన్ లుక్ లోకి మారిపోయాడు. ఇన్నాళ్లూ క్యూట్ గా పక్కింటి కుర్రాడిలా, లవర్ బాయ్ గా అలరించిన ఈ హీరో, ఇప్పుడు అశ్వథ్థామ సినిమాతో కంప్లీట్ యాక్షన్ మూడ్ లోకి వచ్చేశాడు. బాగా ఎక్సర్ సైజులు చేసి సిక్స్ ప్యాక్ కూడా సాధించాడు. తన కుటుంబాన్ని కాపాడుకునే అశ్వథ్థామగా మారడంతో పాటు.. ఓ సీరియల్ కిల్లర్ అంతు చూసే అవతారం ఎత్తాడు. ఇవన్నీ ఈరోజు రిలీజైన అశ్వథ్థామ ట్రయిలర్ లో కనిపించాయి.

టీజర్ తోనే ఎట్రాక్ట్ చేసిన అశ్వథ్థామ, కొద్దిసేపటి కిందట విడుదలైన ట్రయిలర్ తో కూడా ఆకట్టుకున్నాడు. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలెట్స్ గా నిలిచాయి.

ట్రయిలర్ లోనే కథను దాదాపు రివీల్ చేశారు. కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగా, వరుస హత్య కేసుల్ని ఛేధించే హీరోగా శౌర్య ఇందులో కనిపిస్తున్నాడు. అయితే విలన్ ఎవరనే విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. అదే ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ కానుంది.

ఈ సినిమాకు నాగశౌర్య స్వయంగా కథ అందించగా.. రమణతేజ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మాత్రమే పరిమితం కాగా, శ్రీచరణ్ పాకాల సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా జనవరి 31న థియేటర్లలోకి వస్తోంది.