షూటింగ్ అప్ డేట్స్

Sunday,January 26,2020 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోని కపూర్ సమర్పణలో, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా మొదటి షెడ్యుల్ హైదరాబాద్ లో జరుగుతుంది. 10 రోజులు ఈ షెడ్యుల్ వుంటుంది.

అక్కినేని నాగార్జున  అహితోష్ సోల్మన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్  హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పటికే ఓల్డ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు తీసిన యూనిట్ ఇప్పుడు ఖైరతాబాద్ లో మరికొన్ని సీన్స్ తీస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పురి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఫైటర్’ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది. దాదాపు నెల రోజుల పాటు కంటిన్యూగా షెడ్యుల్ జరగనుంది. ఆ తర్వాత హైదరబాద్ లో రెండో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు.


రవితేజ , మలినేని గోపిచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘క్రాక్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. జనవరి 27 నుంచి యూనిట్ ఒంగోలు కి షిఫ్ట్ అవ్వనుంది. అక్కడ  మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను టాగూర్ మధు నిర్మిస్తున్నాడు.

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు, కలైపులి థాను కలిసి నిర్మిస్తున్న’నారప్ప’ షూటింగ్  అనంతపురం లో జరుగుతుంది. ప్రస్తుతం వెంకటేష్ , ప్రియమణి మిగతా వారిపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అసురన్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.


రానా హీరోగా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా షూటింగ్ కేరళ లో జరుగుతుంది. వేణు ఉడుగుల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ‘భీష్మ’ సినిమా షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తి. ఆ రెండు పాటలను ఈనెల 27 నుంచి అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో షూట్ చేయనున్నారు.

 

 

గోపీచంద్‌, సంపత్‌నంది కాంబినేషన్లో రూపొందుతున్న ‘సీటిమార్’ సినిమా షూటింగ్ రాజమండ్రి, యానాంలో పరిసర ప్రాంతాల్లో  జరుగుతుంది. ఈనెల 25వరకు ఈ షెడ్యుల్ వుంటుంది.