నారప్పగా మారిన వెంకీ

Wednesday,January 22,2020 - 12:06 by Z_CLU

వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వచ్చింది. మూవీ ఇలా సెట్స్ పైకి రావడమే ఆలస్యం.. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. వెంకీ కొత్త సినిమాకు నారప్ప అనే టైటిల్ పెట్టారు. ఓల్డ్ వారియర్ గెటప్ లో వెంకీ లుక్ అదిరింది.

తమిళ్ లో సూపర్ హిట్టయిన అసురన్ కు రీమేక్ గా వస్తోంది నారప్ప. ఎలాంటి మార్పుచేర్పులు చేయకుండా హానెస్ట్ రీమేక్ గా వస్తోంది. తమిళ్ లో ధనుష్ పోషించిన పాత్రను తెలుగులో వెంకీ పోషిస్తున్నాడు. హీరోయిన్ గా ప్రియమణిని సెలక్ట్ చేశారు. మణిశర్మ సంగీత దర్శకుడు.

ఈ సినిమా కోసం భారీ ఎత్తున కాస్టింగ్ కాల్ చేపట్టారు. దాదాపు 100 మందికి పైగా ఆర్టిస్టుల్ని తీసుకున్నారు. వాళ్లందరికీ వర్క్ షాప్ కూడా పూర్తిచేశారు. సురేష్ బాబు, కళైపులి థాను కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రైతుగా కనిపించబోతున్నాడు వెంకీ.