వర్షాకాలం.. యువ తరంగం.. టాలీవుడ్ యూత్ ఫెస్ట్

Sunday,July 02,2017 - 04:05 by Z_CLU

జులై వచ్చేసింది..ఈ వీక్ నుంచే యంగ్ హీరోలు తమ లేటెస్ట్ మూవీస్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నాని తో మొదలు వరుణ్ తేజ్ తేజ్, సుధీర్ బాబు, ఆది,సందీప్ కిషన్, నారా రోహిత్ తమ లేటెస్ట్ మూవీస్ తో జులై అంతా థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.

జులై 7న నాని ‘నిన్ను కోరి’ సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తుండగా.. జులై రెండో వారం లో ‘శమంతక మణి’ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్నారు నారా రోహిత్,ఆది,సుధీర్ బాబు,సందీప్ కిషన్. ఇక ఇదే నెలలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఆడియన్స్ ను ఫిదా చేయడానికి ‘ఫిదా’ సినిమాతో జులై 21 న రాబోతున్నాడు.


ఈ ఆరుగురు యంగ్ హీరోలు జులై లో థియేటర్స్ లో హంగామా చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫినిష్ చేసేస్తూ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడానికి ప్రమోషన్స్ కూడా మొదలెట్టేసారు. మరి ఈ సినిమాలతో జులై లో ఈ యంగ్ హీరోలు ఎంత వరకూ కలెక్ట్ చేస్తారో..చూడాలి.