రెడ్డి గారు.. జయసింహా.. నెక్ట్స్ ఏంటి?

Sunday,July 02,2017 - 05:24 by Z_CLU

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101 వ సినిమా ‘పైసావసూల్’ లో నటిస్తున్న నందమూరి బాలయ్య ఈ సినిమాను ఫినిషింగ్ స్టేజీ కి తీసుకొచ్చేశాడు. ప్రెజెంట్ ఈ సినిమాకు సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి అవ్వడంతో తన 102 సినిమా పై ఫోకస్ పెట్టేసాడట నందమూరి నట సింహం. కె.ఎస్.రవి కుమార్ డైరెక్షన్ లో సి.కళ్యాణ్ నిర్మాణం లో భారీ గా తెరకెక్కనున్న ఈ సినిమా కి లేటెస్ట్ గా ‘జయసింహ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారనే వార్త వినిపిస్తుంది.

ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేయనున్నాడని అందుకే ఈ సినిమాకు ‘జయసింహ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారని, గతంలో ‘సింహ’ టైటిల్ తో బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య ఈ సినిమాకు ఈ టైటిల్ సూచించాడని టాక్. త్వరలోనే ఈ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.